వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పీవీకి స్మారక స్థూపం: అందుకేనంటూ అజమ్ ఘాటు వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావుకు ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేస్తామన్న ఎన్డీయే ప్రభుత్వం పైన ఉత్తర ప్రదేశ్ మంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అజమ్ ఖాన్ మంగళవారం ఘాటు విమర్శలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో పీవీ రోల్‌కు ప్రతిఫలంగా దీనిని ఇస్తున్నారని ఆరోపించారు.

బాబ్రీ కూల్చివేత, చబూతర నిర్మాణం విషయంలో ఆరెస్సెస్‌తో మాజీ ప్రధానికి ఉన్న అప్రకటిత అవగాహనకు ప్రతిఫలమని అజం ఖాన్ ఆరోపించారు. బాబీ కూల్చివేతతో బీజేపీ నేతలను శిక్షించాలంటూ సీబీఐ కోరటం కుట్రలా కనిపిస్తోందన్నారు.

Azam Khan

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆరెస్సె్‌సకు లోపాయకారీగా మద్దతిచ్చిన అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావును గౌరవించేందుకే ఎన్డీయే సర్కారు ఆయనకు స్మారకస్థలిని నిర్మిస్తోందని ఆజమ్‌ ఖాన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా, ఢిల్లీలో పీవీ నర్సింహా రావు స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎన్డీయే ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.

English summary
PV Narsimha Rao memorial NDA's reward for his role in Babri demolition: Azam Khan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X