వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వర్ణపతాక విజేత పీవీ సింధూకు ప్రధాని మోడీ, సీఎం జగన్, కేటీఆర్‌ల అభినందనలు

|
Google Oneindia TeluguNews

ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధుకు పలువురు ప్రశంశలు కురిపించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ, క్రీడా మంత్రి కిరణ్ రిజ్జు, ఏపీ సీఎం జగన్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీష్ రావులు అభినందనలు తెలిపారు. సింధును పొగడ్తలతో ముంచెత్తారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమే కుటుంభ సభ్యులు స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

PV Sindhu have been congratulated from across the country

పీవీ సింధు ప్రపంచ బ్యాడింటన్ క్రీడలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో రెండు సార్లు గోల్డ్‌ ఛాన్స్ మిస్సయిన సిందు ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సింధు అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి స్వర్ణం గెలిచింది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు ఘనత సాధించింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన తుదిపోరులో సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో జపాన్‌ క్రీడాకారిణి, 2017 చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఒకుహరను చిత్తుచేసింది.ఈ సారి సత్తా చాటింది. బంగారు పతకాన్ని సాధించింది.

ఏకపక్షంగా సాగిన తొలి గేమ్‌ను తెలుగుతేజం సింధు అలవోకగా సొంతం చేసుకుంది. అదే జోరులో రెండో గేమ్‌నూ గెలిచి మ్యాచ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ఒకుహరకు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. సింధు కొట్టే స్మాష్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానమే లేకపోయింది. సెమీఫైనల్‌ స్ట్రాటజీనే సింధు ఫైనల్లోనూ అమలు చేసి విజయం సాధించింది. క్రాస్‌ కోర్టు షాట్లతో ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి ఆ తర్వాత అలవోకగా పాయింట్లు కొల్లగొట్టింది. సెమీఫైనల్‌ గెలుపు స్ఫూర్తితో రెచ్చిపోయి ఆడింది.

English summary
PV Sindhu has won many gold medals at the World Badminton Championships. Prime Minister Modi, Sports Minister Kiran Rizju, AP CM Jagan and former Chief Minister of AP Chandrababu Naidu congratulated TRS Working President KTR along with former Minister Harish Rao. Sindhu was overwhelmed with compliments. Greetings via Twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X