• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కదిలిపోయిన బాలీవుడ్: ‘మహా’ పాదయాత్రను ‘జై కిసాన్’ అంటూ రెస్పెక్ట్

By Swetha Basvababu
|

ముంబై: వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎలుగెత్తి చాటేందుకు మహారాష్ట్ర అన్నదాత వారం పాటు నిర్వహించిన 'మహా' పాదయాత్ర అన్ని వర్గాల వారిని ఆలోచింపజేసింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారిని, ముంబై డబ్బా వాలాల వారిని, కార్పొరేట్ ప్రముఖులను, బాలీవుడ్ సినీ తారలను కదిలించేసింది. బాలీవుడ్ ప్రముఖుల్లో రితేశ్ దేశ్ ముఖ్ మొదలు డియా మీర్జా, ఓనీర్ వరకు పలువురు సినీ తారలు అన్నదాతల ఆందోళనకు మద్దతు పలికారు.

అన్నదాతలను గౌరవించాలని కోరారు. సుమారు 35 వేల మందికి పైగా అన్నదాతలు నాసిక్ నుంచి ముంబై వరకు 180 కి.మీ. దూరం ఆరు రోజుల్లో పాదయాత్రగా చేరుకుని.. రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం తీవ్రతను ప్రభుత్వం ద్రుష్టికి తేవడంలో విజయం సాధించారని బాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు.

 విద్యార్థుల పరీక్షల పట్ల రైతుల ఔదార్యం ఇలా

విద్యార్థుల పరీక్షల పట్ల రైతుల ఔదార్యం ఇలా

ఆదివారానికి సోమయ్య గ్రౌండ్స్‌కు చేరుకున్న అన్నదాతలు విశ్రాంతికి తావు లేకుండా తమ ఉదారతను చాటుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం సోమయ్య గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా విధాన సభకు చేరుకుని అసెంబ్లీని ముట్టడించాలి. కానీ ప్రజలకు ప్రత్యేకించి పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల వేళ ఇబ్బందులు తలెత్తొద్దని ఔదార్యం ప్రదర్శించారు. ప్రభుత్వం విన్నపం మేరకు పురుషులు, మహిళలు, యువకులు, వ్రుద్ధుల వరకు వారు రాత్రి వేళ నిద్రను మానుకున్నారు.

 పిల్లల భవిష్యత్ పట్ల అన్నదాత స్ఫూర్తిని స్వాగతించిన సినీ రంగం

పిల్లల భవిష్యత్ పట్ల అన్నదాత స్ఫూర్తిని స్వాగతించిన సినీ రంగం

సోమయ్య గ్రౌండ్స్ నుంచి అర్థరాత్రి వేళ రెండు గంటలకు ఆజాద్ మైదాన్ వద్దకు చేరుకున్నారు. తాము త్యాగాలకు మారుపేరని రుజువు చేశారు. పిల్లల భవిష్యత్ పట్ల అన్నదాతల స్ఫూర్తిని బాలీవుడ్ ప్రముఖులు స్వాగతించారు. కొందరు వారి స్ఫూర్తికి గౌరవ వందనం సమర్పించారు. రైతుల కష్టాలను చమత్కారాలతో ట్వీట్లు చేశారు. వారి ట్వీట్లు ఒక్కసారి పరిశీలిద్దాం..

 విద్యార్థుల పట్ల రైతుల కరుణ జై కిసాన్

విద్యార్థుల పట్ల రైతుల కరుణ జై కిసాన్

రితేశ్ దేశ్ ముఖ్ ‘రైతులు తమ పంటలకు సరైన పరిహారం ఇవ్వాలని కోరుతూ 180 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు అంతరాయం కలిగించొద్దన్న సంకల్పంతో చివరి దశలో ఆదివారం రాత్రి వేళ ఆజాద్ మైదాన్‌కు తరలి వెళ్లారు. విద్యార్థుల పట్ల వారి కరుణకు, గౌరవానికి సెల్యూట్ చేస్తున్నా జై కిసాన్' అని ట్వీట్ చేశారు.

 అష్టకష్టాల్లో చిక్కుకున్న రైతులకు అండగా నిలుద్దాం

అష్టకష్టాల్లో చిక్కుకున్న రైతులకు అండగా నిలుద్దాం

బాలీవుడ్ నటి డియా మీర్జా స్పందిస్తూ ‘మన గమ్యస్థానాలు ఒకదానితో మరొకటి పెనవేసుకున్నాయి. మన అన్నదాతలు ఆహార ఉత్పత్తులు పండిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వారి ప్రాణాలు, జీవితాలు సమస్యాత్మకం అయ్యాయి. మధ్య దళారుల దోపీడి, సుస్తిరమైన మద్దతు లేకపోవడం వల్లే అన్నదాతలకు అష్టకష్టాలు. మన రైతులకు మద్దతుగా నిలుద్దాం' అని ట్వీట్టర్ పేజీలో పేర్కొన్నారు.

 దయాగుణానికి మారుపేరుగా నిలిచిన అన్నదాత

దయాగుణానికి మారుపేరుగా నిలిచిన అన్నదాత

బాలీవుడ్ నటుడు ఓనీర్ స్పందిస్తూ ‘కిసాన్ లాంగ్ మార్చ్ ను గౌరవిద్దాం. రైతులంతా దయాగుణం కలవారు. రాజకీయ పార్టీల నాయకత్వాలు ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవు. అసలు ప్రజల అసౌకర్యాన్ని పట్టించుకోకుండా రాజకీయ ర్యాలీలు నిర్వహిస్తుంటారు' అని వ్యాఖ్యానించారు.

 రైతులకు న్యాయం చేయాలని ప్రకాశ్ రాజ్ ఇలా ట్వీట్

రైతులకు న్యాయం చేయాలని ప్రకాశ్ రాజ్ ఇలా ట్వీట్

బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ‘కాళ్లబొబ్బలు పెట్టి.. వారి కళ్లలో ఆకలి కనిపిస్తున్నది. స్వచ్ఛంగా, హుందాగా పాదయాత్ర చేశారు. మీరు (ప్రభుత్వాలు) చెప్పిన అబద్దాలు, వాగ్దానాలు విఫలం అయ్యాయనడానికి రైతుల పాదయాత్రే నిదర్శనం. న్యాయం చేయాలని మీ తలుపు తట్టారు. వారికి న్యాయం చేకూర్చండి. జస్ట్ ఆస్కింగ్' అని ట్వీట్ చేశారు.

 యావత్ భారత రైతుల గోస విని ప్రతిస్పందించాలి

యావత్ భారత రైతుల గోస విని ప్రతిస్పందించాలి

సిద్ధార్థ బసు అనే సినీ నటుడు స్పందిస్తూ ‘కేవలం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించడం కాదు. యావత్ భారతం అంతటా అడుగడుగునా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వినడంతోపాటు వాటికి అనుగుణంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నది' అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

 అన్నదాతకు జరిగే రైతు ఆందోళనను గౌరవిద్దాం

అన్నదాతకు జరిగే రైతు ఆందోళనను గౌరవిద్దాం

బాలీవుడ్ ప్రముఖుడు శిరీష్ కుండర్ స్పందిస్తూ ‘రైతులు, సైనికులు మనకోసం ప్రాణాలర్పిస్తారు. గౌరవిస్తారు? అన్యాయానికి వ్యతిరేకంగా, రాజకీయ ఏజెండాకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిని గౌరవించాలి. గోవుల మాదిరిగా విధేయంగా ఉండే రైతులను ప్రేమిద్దాం' అని తెలిపారు.

2019 నాటికి మేధస్సు పెంచుకుందామని శృతి సేథ్ ట్వీట్

2019 నాటికి మేధస్సు పెంచుకుందామని శృతి సేథ్ ట్వీట్

శృతి సేథ్ అనే బాలీవుడ్ కథా నాయిక స్పందిస్తూ ‘ఇది ఒక రాజకీయ డ్రామాగా మారుతుంది. చివరకు పేద రైతులు శుష్క హస్తాలతో ఇంటికి వెళతారు. అప్పుడు ప్రభుత్వం అటెన్షన్ ప్రదర్శించి గందరగోళంగా మారుతుంది. 2019 నాటికి మేధస్సు పెంచుకుందాం' అని ట్వీట్ చేశారు.

 జై కిసాన్ అని నినదించిన కునాల్ కెమ్ము

జై కిసాన్ అని నినదించిన కునాల్ కెమ్ము

కష్టాల్లో ఉన్న రైతుల హ్రుదయపూర్వకంగా మద్దతు తెలుపుతున్నట్లు మారియా గోరేటి ట్వీట్ చేశారు. అన్నదాతలైన తన నానమ్మ, తాతయ్యల కష్టాలు తెలుసునని ఆమె అన్నారు. భారతీయ రైతులు అద్భుతమైన వారని ప్రితీశ్ నాందీ అనే సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రక్రుతితో పోరాడే అన్నదాతకు రాజకీయాలకు అతీతంగా మద్దతునిస్తూ గౌరవిద్దామని పిలుపునిచ్చారు. కునాల్ కెమ్ము అనే సినీ తార స్పందిస్తూ రైతుల కష్టాలను భావోద్వేగంగా వినాల్సిన అవసరం ఉన్నదని ట్వీట్ చేశారు. జై కిసాన్ అని కునాల్ కెమ్ము పేర్కొన్నారు.

రైతులందరికీ మద్దతునిస్తున్నానన్న మాధవన్

రైతులందరికీ మద్దతునిస్తున్నానన్న మాధవన్

అతుల్ కాస్బేకర్ అనే బాలీవుడ్ ప్రముఖుడు స్పందిస్తూ మహోధ్రుతంగా పాదయాత్ర చేసిన రైతులు ప్రజలకు అసౌకర్యం కలుగొద్దని.. పిల్లలకు పరీక్షలకు ఆటంకం కలుగొద్దని నిర్ణయించుకోవడం గొప్ప నిర్ణయం అని. వారు సామూహికంగా గౌరవం ప్రదర్శించారని ట్వీట్ చేశారు. అభిషేక్ కపూర్ అనే మరో సినీ ప్రముఖుడు స్పందిస్తూ మండే ఎండలో తమ కష్టాలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు మహా పాదయాత్రతో తరలి వచ్చారు రైతులు అని ట్వీట్ చేశారు. దేశంలోని రైతులందరికి మద్దతునిస్తున్నానని ఆర్ మాధవన్ తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood celebrities like Riteish Deshmukh, Dia Mirza and Onir on Monday expressed support and respect for the farmers community as an estimated 35,000 peasants completed a 180-km march to Mumbai over six days to bring to the notice of the government the agrarian crisis gripping the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more