వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వణికిస్తున్న ఆర్ వాల్యూ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, అసలేంటీ ఆర్ వాల్యూ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు తాజాగా పెరుగుతున్నాయి. శుక్రవారం 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్ ఫ్యాక్టర్ అనేది దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. దేశంలో సగం కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతుండటం గమనార్హం. కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాతమేటికల్ సైన్సెస్ తాజా విశ్లేషణలో ఆర్ వాల్యూ పుణె, ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో భారీ పెరుగుతోందని తేలింది.

అసలు ఈ ఆర్ వాల్యూ అంటే?

అసలు ఈ ఆర్ వాల్యూ అంటే?

ఆర్ వాల్యూ 0.95 అంటే.. ప్రతి 100 మంది కరోనా రోగులు సగటున మరో 95 మందికి వ్యాధిని అంటించడం. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువగా ఉందంటే అక్కడ కరోనా కేసుల వ్యాప్తి తక్కువగా ఉందని అర్థం. ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉందంటూ ఆ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని సంకేతం. అనేక మందికి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతోంది. కరోనా కొత్త కేసులు, యాక్టివ్ కేసులు కూడా ఎక్కువ లేదా సమానంగా ఉండే అవకాశం ఉంది.

ఆర్ వాల్యూ 1కి సమీపంలో ఉంటే.. కరోనాను ఆ ప్రాంతంలో సులభంగా తగ్గించే అవకాశం ఉంటుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ విశ్లేషణ బృందానికి నాయకత్వం వహిస్తున్న సీతాభ్ర సిన్హా వెల్లడించారు.

భారత్‌లో ఆర్ వాల్యూ ఎలా ఎంది?

భారత్‌లో ఆర్ వాల్యూ ఎలా ఎంది?

మార్చి 9 నుంచి ఏప్రీల్ 21 మధ్య కాలంలో ఆర్ వాల్యూ 1.37గా ఉంది. ఏప్రి్ల 24 నుంచి మే 1 వరకు ఇది 1.18కి చేరుకుంది. ఏప్రిల్ 29 నుంచి మే 7 మధ్య కాలంలో 1.1 గా ఉంది.

మే 9 నుంచి 11 మధ్య,ఆర్- వాల్యూ 0.98 గా ఉంటుందని అంచనా వేశారు. ఇది మే 14 నుంచి మే 30 మధ్య 0.82 కి, మే 15 నుంచి జూన్ 26 వరకు 0.78 కి పడిపోయింది. అయితే ఆర్- విలువ జూన్ 20 నుంచి జూలై 7 వరకు 0.88 కి, జూలై 3-22 నుంచి 0.95 కి పెరిగింది.
కాగా, దేశంలో యాక్టివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఆర్ వాల్యూ అనేది పలు సమస్యలకు పరిష్కారం చూపుతుందని సిన్హా తెలిపారు.

కేరళలో ఆందోళనకరంగా పరిస్థితి..

కేరళలో ఆందోళనకరంగా పరిస్థితి..

కేరళలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న సగం కేసులు కేరళ నుంచే ఉంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆరుగురు ఆరోగ్య నిపుణుల బృందాన్ని కేరళకు పంపుతున్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్యమంత్రి తెలిపారు. కేరళలో శుక్రవారం కూడా 20 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షా 60వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.

Recommended Video

Corbevax: Biological E's COVID-19 Vaccine To Be Launched By September | Oneindia Telugu
ప్రధాన నగరాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ఇలా..

ప్రధాన నగరాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ఇలా..

ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర ఒక్కటే ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ కలిగివున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆర్ వాల్యూ 1కి సమీపంలో ఉంది. ఆర్ వాల్యూ 1 ఉండి యాక్టివ్ కేసులు వందల్లో ఉంటే ఆ ప్రాంతంలో కరోనాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆర్ వాల్యూ ఒకటి కంటే ఎక్కువగా ఉండి.. వేలల్లో యాక్టివ్ కేసులున్న ప్రాంతాల్లో మాత్రం కరోనా కట్టడి కష్టతరంగా మారినట్లు చెప్పవచ్చు. ఢిల్లీలో ప్రస్తుతం ఆర్ వాల్యూ 1కి సమీపంలో ఉంది. బెంగళూరులో జూలై 7-13 నుంచి ఆర్-విలువ 0.92. జూలై 13-17 నుంచి ఇది స్వల్పంగా 0.95కి పెరిగింది. జూలై 17-23 నుంచి ఇది 0.72 కి పడిపోయింది. ముంబై విషయంలో, జూలై 2-4 మధ్య ఆర్-విలువ 0.96గా ఉంది. ఇది జూలై 6-9 మధ్య 0.89 కి పడిపోయింది. జూలై 22-24 మధ్య ఇది 0.74 కి పడిపోయింది. చెన్నైకి, జూన్ 29 నుంచి జూలై 7 మధ్య ఆర్- విలువ 0.63 ఉండగా, ఇది జూలై 16-19 మధ్య 1.05కి పెరిగింది. ఇది 21-24 మధ్య 0.94, క్షీణత సంకేతాలను చూపుతోంది. కోల్‌కతా విషయంలో, ఆ- విలువ జూలై 1-13 మధ్య 0.80, తర్వాత జూలై 12-17 మధ్య 0.91. ఇది జూలై 17-24 మధ్య 0.86 కి పడిపోయింది.

English summary
R-value Threatens India's Fight Against Covid: R-value explained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X