వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రన్ వేపై కుందేళ్లు: రెండు విమానాలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమదం తృటిలో తప్పింది. రన్‌వేపై ఉన్న కుందేళ్ల కారణంగా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. అయితే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింద

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమదం తృటిలో తప్పింది.
రన్‌వేపై ఉన్న కుందేళ్ల కారణంగా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొనబోయాయి. అయితే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అప్రమత్తమవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీకి 142మంది ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం, బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ వచ్చిన ఇండిగో విమానం శుక్రవారం సాయంత్రం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.

ఇండిగో విమానం ల్యాండ్‌ అయిన రన్‌వే క్లియర్‌ అయిన తర్వాత అదే రన్‌వేపై నుంచి స్పైస్‌జెట్‌ విమానం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. కానీ ఇండిగో విమానం పూర్తిగా వెళ్లకముందే స్పైస్‌జెట్‌కు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది.

Rabbits Found on Ahmedabad Airport Runway, Collision of Planes Averted

టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమాన పైలట్‌ను రన్‌వే బ్యాక్‌ట్రాక్‌పైకి రావొచ్చని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ తెలిపింది. ఈలోగా ఇండిగో విమానం రన్‌వే నుంచి వెళ్లిపోవాల్సి ఉండగా మధ్యలో కుందేళ్లు ఉండడంతో రన్‌వే ఎగ్జిట్‌ ట్యాక్సీ ట్రాక్‌పై ఆగింది. ఇది గమినించిన ఏటీసీ వెంటనే స్పైస్‌జెట్‌ విమానాన్ని ఆగిపోవాల్సిందిగా సూచించింది.

తక్షణమే ఆగిపోవాలని రెండు సార్లు హెచ్చరించడంతో స్పైస్‌జెట్‌ పైలట్‌ టేకాఫ్‌ను నిలిపేసి విమానాన్ని ఆపేశారు. కొద్ది నిమిషాల్లో టేకాఫ్‌ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఏటీసీ టేకాఫ్‌ను నిలిపేసింది. ఏటీసీ అధికారులు, పైలెట్లు వెంట వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

English summary
A Delhi-bound plane of SpiceJet had to abort take-off at the last minute as an IndiGo flight could not clear the runway due to the presence of rabbits on the strip, averting a major mishap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X