వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామిడిపండ్ల కోసం సీఎం, మాజీ గొడవలో ట్విస్ట్: తినే హక్కునాదేనని లాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో పళ్ల విషయంలో ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య రగడ జరుగుతుండగా.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ రంగంలోకి వచ్చారు. దీంతో ఇది కొత్త మలుపు తిరిగింది.

ముఖ్యమంత్రి అధికారిక బంగ్లాలో ఫలసాయంపై నితీష్, మాంఝీ మధ్య గొడవ జరుగుతోంది. దీనిపై లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ.. అసలు ఆ మొక్కలు నాటింది తానే అని, ఆ పండ్లను తినే హక్కు తనకే ఉందని చెప్పారు.

ఆ మామిడి పండ్లు, ఫలసాయంపై హక్కు విషయానికి వస్తే తనకు, తనతో పాటు తన భార్య రబ్రీదేవికి హక్కు ఉంటుందని తెలిపారు. వాటిని తామే నాటామని చెప్పారు.

కాగా, బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంతి జితన్ రాం మాంఝీల మద్య మరింత రాజకీయ కక్షలు పెరిగిపోయాయి. మాజీ సీఎం మామిడి పండ్లు కోయకుండా ఉండటానికి సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

Rabri and I have first right over mangoes: Lalu

ఈ విషయం తెలుసుకున్న రాజకీయ విశ్లేషకులు ఇదేమి కక్షరా బాబు అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి నుండి జితన్ రాం మాంఝీని బలవంతంగా కిందకు దింపిన విషయం తెలిసిందే. తరువాత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో కుర్చున్నారు.

పదవి నుండి దిగిపోయిన జితన్ రాం మాంఝీ బీహార్ ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉంటున్నారు. ఆయన ఆ ఇంటిని ఇప్పటి వరకు ఖాళీ చెయ్యలేదు. ఈ ఇంటి ఆవరణంలో మామడితో పాటు వివిధ రకాల పండ్ల చెట్లు ఉన్నాయి.

అక్కడ ఉన్న మామడి చెట్ల నుండి మామిడి పండ్లు కోయకుండా చూడటానికి 24 మంది సాయుధ పోలీసులను రంగంలోకి దింపారు. అందులో ఆరుగురు ఎస్ఐలు, 16 మంది కానిస్టేబుల్ లు ఉన్నారు. అందరి దగ్గర అత్యాధునిక తుపాకులు ఉన్నాయి.

విషయం తెలుసుకున్న మాజీ సీఎం జితన్ రాం మాంఝీ అనుచరులు, ఆయన పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మాంఝీని బలవంతంగా ఇంటి నుండి ఖాళీ చేయించాలని ఇలా మామిడి పండ్ల రక్షణ ముసుగులో అక్కడ పోలీసులతో నిఘా పెట్టారని విమర్శిస్తున్నారు.

ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థానంలో కుర్చుని ఉన్న నితీశ్ కుమార్ చిన్న పిల్లలు మీద కసి తీర్చుకున్నట్లుగా మాజీ సీఎం ఇంటి దగ్గర మామిడి పండ్లు కోయకుండా ఉండటానికి పోలీసులను నియమించారని విమర్శలు వస్తున్నాయి.

English summary
This has turned into a triangle now. The story of custody of mango, litchi and jackfruit trees inside the premises of Bihar chief minister's bungalow in Patna has got a new claimant- RJD chief Lalu Prasad Yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X