వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 నగరాల్లో జైకోవ్ డీ, కోవాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగంలో భారత్ ముందడుగు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో భారత్ ముందు వరసలో ఉంది. భారత్ బయోటెక్, జైడస్ కాడిలా అనే రెండు కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో గల ఆరు నగరాల్లో హ్యుమన్ ట్రయల్స్ చేస్తున్నాయి. తొలి, రెండో విడత క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు రెండు సంస్థలకు జూలై 15వ తేదీన ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి భారత్ బయోటెక్‌కి చెందిన 0.5 ఎంఎల్ ఇంజెక్షన్‌ను ఎయిమ్స్‌లో ఇచ్చారు.

 ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... మానవ శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా.. ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... మానవ శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా..

 ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కూడా..

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కూడా..

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ డెవలప్ చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో దేశంలో కూడా ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఆప్లై చేశామని, అనుమతి రాగానే ప్రయోగం చేస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ చెబుతోంది. కోవాక్సిన్‌ను భారత్ బయోటెక్‌..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ ఢిల్లీ, నేషణల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణే సహకారంతో అభివృద్ది చేసింది. 11 నగరాల్లో గల 12 ఆస్పత్రుల్లో 500 వాలంటీర్లను పరీక్షిస్తామని చెబుతోంది. అయితే వారి వయస్సు 18 నుంచి 55 ఏళ్ల మధ్యలో ఉంటుందని.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే పరీక్షిస్తామని తెలిపారు.

ముందు అహ్మదాబాద్‌.. తర్వాత మిగతా నగరాల్లో

ముందు అహ్మదాబాద్‌.. తర్వాత మిగతా నగరాల్లో

జైడస్ కాడిలాకు చెందిన జైడోవ్-డీ వ్యాక్సిన్ మాత్రం సంస్థకు చెందిన పరిశోధన కేంద్రం అహ్మదాబాద్‌లో మాత్రమే పరీక్షిస్తామని స్పష్టంచేసింది. తర్వాత ఇతర నగరాల్లో కూడా ప్రయోగిస్తామని వెల్లడించింది. కోవాక్సిన్ ట్రయల్స్ హైదరాబాద్‌, పాట్నా, కంచీపురం, రోహ్ తక్, ఢిల్లీలో ఇప్పటీకే ప్రారంభమయ్యాయి. శనివారం నాగ్ పూర్, భువనేశ్వర్, బెలగమ్, గోరఖ్ పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్టణంలో ప్రయోగిస్తున్నారు.

రెండురోజుల తర్వాత పరిశీలన

రెండురోజుల తర్వాత పరిశీలన

ఢిల్లీకి చెందిన యువకుడికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రెండు గంటలు పరిశీలించామని.. తర్వాత ఇంటికి పంపించామని డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. అతనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని.. రెండురోజుల తర్వాత మరోసారి పరిశీలిస్తామని చెప్పారు.

Recommended Video

COVID-19 : గణనీయంగా పెరిగిన రోగ నిరోధక శక్తి.. ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే..!
10 మంది ఎంపిక

10 మంది ఎంపిక

నాగ్ ‌పూర్‌లో ఈ నెలాఖరు లేదంటే ఆగస్ట్ మొదటివారంలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని పరిశోధన కేంద్రం డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే తాము 10 మందిని ఎంపిక చేశామని.. ప్రస్తుతం మిగతా వారి ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని, రక్త నమూనాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

English summary
Human trials using the vaccine candidates of two companies — Bharat Biotech and Zydus Cadila — are currently on in six cities in as many states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X