వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేసుగుర్రంలో విలన్.. పార్లమెంట్ లో పాట పాడి ఒప్పిస్తాడా ... భోజ్ పురిలో దుమ్ము లేపిన ఎంపీ రవి కిషన్

|
Google Oneindia TeluguNews

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సినీ నటుడు రవి కిషన్ గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా బీజేపీ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. ఈయన అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా పేరుతో విలన్ గా నటించి మెప్పించారు. నటనలోనే కాదు ఎంపీగా కూడా ఆయన తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంతో లోక్ సభలో ఆకట్టుకున్నారు.

పవన్ రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకుడవుతారా అన్న మోత్కుపల్లిపవన్ రెండు రోజులు తిరిగి పది రోజులు ఇంట్లో పడుకుంటే నాయకుడవుతారా అన్న మోత్కుపల్లి

 లోక్ సభలో భోజ్ పురి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రవి కిషన్

లోక్ సభలో భోజ్ పురి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రవి కిషన్

తమ భాషకు సముచిత స్థానం కావాలని ఆయన పార్లమెంట్ వేదికగా తన వాణి వినిపించారు. అంతే కాదు పాత పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడుతారనీ, అర్థం చేసుకోగలరని రవి కిషన్ తెలిపారు. కరేబియన్ దేశాలలో కూడా భోజ్ పురి మాట్లాడుతున్నారని, అయినా ఇప్పటివరకూ తమ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆయన తన ఆవేదన తెలియచేసారు. భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడతారనీ, అర్థం చేసుకోగలరని ప్రముఖ నటుడు, బీజేపీ నేత, గోరఖ్ పూర్ లోక్ సభ సభ్యుడు రవి కిషన్ పేర్కొన్నారు. మారిషస్ లో మరో అధికార భాషగా భోజ్ పురిని గౌరవించారని ఆయన పేర్కొన్నారు.

 భోజ్ పురిలో పాట పాడి అందరినీ ఆకట్టుకున్న రేసుగుర్రం విలన్ ఎంపీ రవి కిషన్

భోజ్ పురిలో పాట పాడి అందరినీ ఆకట్టుకున్న రేసుగుర్రం విలన్ ఎంపీ రవి కిషన్

అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల కాశీకి వచ్చినప్పుడు కాశీ ప్రజలారా ఎలా ఉన్నారు అంటూ భోజ్ పురిలో మాట్లాడారనీ భోజ్ పురీ మాట్లాడే ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. దీంతో తమ భాషకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా రవికిషన్ పార్లమెంట్ సభలోనే భోజ్ పురిలో ఓ పాటను పాడి సభలో సభ్యులందరిని కాసేపు అలరించారు. అయితే ప్రజలు ఓటు వేసి ఎంపీగా పార్లమెంట్‌కి పంపితే ఇలా పాటలు పాడుతూ సభ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని కొందరు విమర్శిస్తే , మరికొందరు మాత్రం తమ భాషపై ఉన్న ప్రేమను, తమ భాషకు రావాలసిన అధికారిక హోదాను తన పాట రూపంలో తెలియచేశాడని అంటున్నారు.

 ప్రస్తుతం ఎనిమిదవ షెడ్యూల్ లో 22 భాషలు ..38 భాషలను చేర్చాలని డిమాండ్

ప్రస్తుతం ఎనిమిదవ షెడ్యూల్ లో 22 భాషలు ..38 భాషలను చేర్చాలని డిమాండ్

రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో 22 భాషలు ఉన్నాయి. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, సింధి, ఉర్డు, తమిళం, తెలుగు ,సంతాలి, మైతాలి మరియు డోగ్రి. ప్రస్తుతం, ఎనిమిదవ షెడ్యూల్‌లో 38 భాషలను చేర్చాలని డిమాండ్ ఉంది. ఇక అలా డిమాండ్ చేస్తున్న భాషల్లో భోజ్ పూరి కూడా ఉంది . ప్రమాణ స్వీకారం సందర్భంగా, కొంతమంది ఎంపీలు భోజ్‌పురిలో ప్రమాణ స్వీకారం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు, కాని అది ఎనిమిదవ షెడ్యూల్ పరిధిలోకి రానందున అనుమతించబడలేదు.

 రేసుగుర్రంలో విలన్ గా మెప్పించిన రవి కిషన్ .. భోజ్ పురి కోసం లోక్ సభనూ మెప్పించే యత్నం

రేసుగుర్రంలో విలన్ గా మెప్పించిన రవి కిషన్ .. భోజ్ పురి కోసం లోక్ సభనూ మెప్పించే యత్నం

అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలో రవి కిషన్ విలన్ గా నటించి మెప్పించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై ఘనవిజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా సభలో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి భోజ్ పురి భాషకు గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో ఆయన ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వార్తల్లో నిలిచాడు.

English summary
BJP MP and Bhojpuri star Ravi Kishan on July 1 sang a song in his native language in the Lok Sabha to draw attention to his demand for including Bhojpuri in the Eighth Schedule of the Constitution.Raising the issue during the Zero Hour, the actor said Bhojpuri is spoken by over 25 crore people of the country.It is widely spoken in Mauritius and other Caribbean countries, he said.The BJP MP from Gorakhpur, Uttar Pradesh recalled how people reacted with enthusiasm when Prime Minister Narendra Modi greeted people in the Bhojpuri language in Bihar and Varanasi.To drive home his point, he also started singing a line of a Bhojpuri song.Speaker Om Birla immediately interrupted him and asked him to sing later.To this, the actor said through the song he wanted to show the sweetness of the language.The Eighth Schedule of the Constitution comprises 22 languages: Assamese, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Malayalam, Manipuri, Marathi, Nepali, Oriya, Punjabi, Sanskrit, Sindhi, Sindhi, Tamil, Telegu, Urdu, Bodo, Santhali, Maithali and Dogri.At present, there is a demand to include 38 languages in the Eighth Schedule.During oath taking, few MPs expressed the desire to take oath in Bhojpuri but were not allowed since it did not fall under the Eighth Schedule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X