వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాథేమాకు పోలీస్‌స్టేషన్‌లో విఐపీ ట్రీట్‌మెంట్: విచారణకు ఆదేశం

రాథేమాకు దక్షిణ ఢిల్లీలోని విఐపీ ట్రీట్‌మెంట్ లభించింది.రాథేమాకు పోలీస్‌స్టేషన్‌లో విఐపీ ట్రీట్‌మెంట్‌పై విమర్శలుఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాదాస్పద మాతగా పేరొందిన రాధేమాకు ఢిల్లీ పోలీస్‌స్టేషన్‌లో విఐపీ ట్రీట్‌మెంట్ లభించింది.దక్షిణ ఢిల్లీలోని వివేక్ విహర్ పోలీస్ స్టేషన్‌ ప్రధానాధికారి రాథేమాకు స్వాగతం పలకడమే కాదు, తన ఛైర్‌లో రాథేమాను కూర్చోబెట్టాడు.

దొంగ బాబాలు, నకిలీ స్వామీజీల వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్న క్రమంలో దైవాంశ సంభూతులమని ప్రకటించేవారిని నమ్మి మోసపోతున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. డేరా బాబా ఘటనలో ఇంకా అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.

Radhe Maa Gets VIP Treatment, SHO's Chair in Delhi Police Station

అయితే ఈ సమయంలోనే రాథేమాపై కూడ కేసులు నమోదయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు రాధే మా వెళ్లింది. ఈ సందర్భంగా స్టేషన్‌ ప్రధానాధికారి ఎదురెళ్లి మరీ మాతాజీకి స్వాగతం పలికాడు

తన కుర్చీలోనే ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ ఫోటోలు బయటకు పొక్కగా.. ఆ అధికారి నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. రాధేమా వీఐపీ ట్రీట్‌మెంట్‌ అంశం తమ దృష్టికి చేరిందని.. అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు తర్వాత తేలుస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కాగా, మోడ్రన్‌ డ్రెస్సులతో వార్తల్లోకెక్కటం దగ్గరి మొదలైన రాధే మా ప్రస్థానం.. నికీ గుప్తా అనే ఓ మహిళను వేధించటంతో రాధే మాపై గృహ హింస చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. గత నెలలో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలని రాధే మా చేసిన విజ్ఞప్తిని ముంబై కోర్టు తోసిపుచ్చింది .

English summary
In a shocking display of sycophancy, the Station House Officer of a police station in Delhi’s Vivek Vihar was seen vacating his chair for self-styled godwoman Radhe Maa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X