వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిచ్చగాడుగా మారిన వ్యాపారవేత్త, ఆధార్ కార్డుతో షాకింగ్ విషయాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఆధార్‌కార్డు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఆధార్ కార్డు ద్వారా రహస్యాలు బట్టబయలౌతున్నాయి. మొదటి పెళ్ళిని దాచి రెండో పెళ్ళి చేసుకొన్న ఉదంతం అనంతపురంలో బయటపెట్టింది ఆధార్ కార్డు. యాచకుడిగా మారిన తమిళనాడు వ్యాపారవేత్తను ఆధార్ కార్డు ద్వారానే గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారమిస్తే వారు అతడిని తీసుకెళ్ళారు.

Recommended Video

Beggar Family Found To Be Owner Of 5 Mercedes Cars

ఆధార్ కార్డు సంక్షేమ పథకాలతో పాటు ప్రతి అంశాలకు ఆధార్ కార్డును లింక్ చేయాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారాయి. అయితే అదే సమయంలో మొబైల్ ఫోన్లకు ఆధార్ కార్డులను లింక్ చేయడం, పాన్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడానికి 2018 మార్చి నాటికి కేంద్రం గడువు పొడిగించింది.

అయితే ఆధార్ తో తప్పిపోయిన వారు తిరిగి తమ ఇండ్లకు చేరడం వంటి ఘటనలు కూడ చోటు చేసుకొంటున్నాయి. ఇదే తరహ ఘటన యూపీలో చోటు చేసుకొంది. యాచకుడిగా మారిన వ్యాపారవేత్తను ఆధార్ కార్డు ద్వారా గుర్తించారు.

 యాచకుడిగా మారిన వ్యాపారవేత్తను పట్టించిన ఆధార్ కార్డు

యాచకుడిగా మారిన వ్యాపారవేత్తను పట్టించిన ఆధార్ కార్డు

తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన వ్యాపారవేత్త ముత్తయ్యనాడార్‌ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో యాచకుడిగా మారిపోయాడు. ఆరు మాసాలుగా కుటుంబసభ్యులు

అతడి కోసం గాలిస్తున్న ఆచూకీ లభ్యం కాలేదు.యూపీలోని రాయ్‌బరేలి జిల్లా రాల్పూర్‌ పట్టణంలోని యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే స్వామి భాస్కర్‌ స్వరూప్‌జీ ఆశ్రమ పాఠశాల వద్ద ముత్తయ్యనాడార్ యాచకుడిగా తిరుగుతోంటే ఆశ్రమ నిర్వాహకులు చేరదీశారు.ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చారు.

 యాచకుడి వద్ద ఎప్ డి పత్రాలు

యాచకుడి వద్ద ఎప్ డి పత్రాలు

ముత్తయ్యనాడార్‌ను చేరదీసిన భాస్కర్ స్వరూప్‌జీ ఆశ్రమ నిర్వాహకులు అతడి దుస్తులను పరిశీలిస్తే ఆధార్ కార్డు కోటి విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు లభ్యమయ్యాయి. అయితే కోట్లాది రూపాయాల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలతో ముత్తయ్యనాడార్ ఎందుకు యాచకుడిగా మారాడనే విషయమై ఆరా తీశారు. ఆధార్ కార్డు ద్వారా ముత్తయ్య నాడార్ సమాచారం తెలుసుకొన్నారు.

 ఆరు నెలలుగా ముత్తయ్య నాడార్ కోసం గాలింపు చర్య

ఆరు నెలలుగా ముత్తయ్య నాడార్ కోసం గాలింపు చర్య

ఆరు నెలలుగా ముత్తయ్య నాడార్ కోసం కుటుంబసభ్యులు గాలింపు చర్యలను చేపట్టారు.అయినా ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. భాస్కర్‌జీ ఆశ్రమ నిర్వాహకుల సమాచారం మేరకు ముత్తయ్యనాడార్ కూతురు గీత వచ్చారు. తన తండ్రికి రైలులో మత్తు పదార్ధాలివ్వడం వల్ల దారి తప్పి ఉండవచ్చని ఆమె అనుమానించారు.

 ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు

ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు

తమ తండ్రి సమాచారాన్ని ఇచ్చిన ఆశ్రమ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు గీత.తండ్రి కోసం ఎంత తిరిగినా ఫలితం లేకపోయినా, ఆధార్ కార్డు పట్టించిందని ముత్తయ్యనాడార్ కూతురు గీత తెలిపారు.

English summary
Amidst growing political turmoil over Aadhar Card, a shocking news has surfaced from Uttar Pradesh (UP). An old beggar residing in the Ralpur town of Rae Bareli district in UP has been found to be in possession of Aadhar Card and Fixed Deposit (FD) papers worth over a crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X