వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాఫెల్ డీల్’ ఆరోపణలు: ‘మీ ఇష్టం కాదు’ అంటూ కాంగ్రెస్‌కు అనీల్ అంబానీ నోటీసు, వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై అసత్య ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ హితవు పలికింది. రాఫెల్‌ డీల్‌పై బాధ్యతాయుతంగా మాట్లాడాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌, రిలయన్స్‌ ఏరోస్ర్టక్చర్‌లు కాంగ్రెస్‌ పార్టీ నేతలకు నోటీసులు పంపాయి.

రాజకీయ నాయకులకు భావప్రకటనా స్వేచ్ఛ అంటే తమ ప్రయోజనాల కోసం ఇష్టానుసారం మాట్లాడేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్టు కాదని కాంగ్రెస్‌ ప్రతినిధి జైవీర్‌ సెర్గిల్‌ను ఉద్దేశించి రిలయన్స్‌ ఈ నోటీసులో తేల్చి చెప్పింది. మీ(కాంగ్రెస్ నేతలు) రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవాస్తవ, తప్పుడు ప్రకటనలను చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కాబోదని నోటీసులో స్పష్టం చేసింది.

 Rafale Deal: Anil Ambani issues notice to Congress spokesperson Jaiveer Shergill

రాఫెల్‌ ఒప్పందంపై సంయమనంతో వ్యవహరించాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అనీల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ ఏరోస్ర్టక్చర్‌, రిలయన్స్‌ డిఫెన్స్‌లు ఈ నోటీసులో జైవీర్‌ సెర్గిల్‌ను హెచ్చరించాయి.

రిలయన్స్‌కు వ్యతిరేకంగా రణదీప్‌ సుర్జీవాల్‌, అశోక్‌ చవాన్‌, సంజయ్‌ నిరుపమ్‌, అనురాగ్‌ నారాయణ్‌ సింగ్‌, ఊమెన్‌ చాందీ, శక్తి సంహ్‌ గోయల్‌,గొహిల్‌, సునీల్‌ కుమార్‌ జకర్‌. అభిషేక్‌ మను సింఘ్వీ, సునీల్‌ కుమార్‌ జాఖర్‌, ప్రియాంక చతుర్వేది వంటి కాంగ్రెస్‌ నేతలు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని రిలయన్స్‌ పేర్కొంది. కాగా, ఇలాంటి నోటీసులకు తాము బెదిరిపోమని కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Anil Amabani owned Reliance Infrastructure, Reliance Defence and Reliance Defence sent a notice to Congress spokesperson Jaiveer Shergill, asking him to refrain from making unverified, frivolous and defamatory statements on Rafale deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X