వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ ఆరోపణల్ని ఖండించిన అనిల్ అంబానీ రిలయెన్స్ డిఫెన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్‌కు లబ్ధి చేకూర్చేందుకే రాఫెల్ డీల్ అని విమర్శలు గుప్పించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి రిలయెన్స్ డిఫెన్స్ మంగళవారం కౌంటర్ ఇచ్చింది.

మేకిన్ ఇండియాలో భాగంగా సివిల్, డిఫెన్స్‌ హెలికాప్టర్‌ ప్రొగ్రాంలో భాగంగా ఎయిర్ బస్‌, రిలయన్స్‌ డిఫెన్స్ మధ్య జరిగిన చర్చలకు, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య జరిగిన రాఫెల్ డీల్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఎయిర్ బస్‌తో జరిపిన సంప్రదింపుల ఈ మెయిళ్లను కాంగ్రెస్‌ చూపిస్తోందన్నారు.

Rafale deal: Reliance Defence rejects Rahul Gandhis charges

ఎయిర్‌ బస్‌ హెలికాప్టర్‌, రిలయన్స్‌ మధ్య సహకారం కోసమే ఈ చర్చలు జరిగాయని, దీనికి రాఫెల్ డీల్‌కు సంబంధం లేదని కంపెనీ తేల్చి చెప్పింది. రాఫెల్ ఒప్పందం 2016 జనవరి 25వ తేదీన జరిగిందని, 2015 ఏప్రిల్‌ నెలలో కాదని తెలిపింది. ఎయిర్‌ బస్‌ ఉద్యోగి పంపినదిగా పేర్కొంటూ రాహుల్‌ చూపిన ఈ మెయిల్‌పై 2015 మార్చి 28 వ తేదీ ఉంది.

మరోవైపు, రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆయన బయటపెట్టిన ఈ మెయిల్స్ ఓ చాపర్ ఒప్పందానికి సంబంధించినవి కానీ, యుద్ధ విమానాల కొనుగోలుతో వీటికి ఏ సంబంధం లేదని తెలిపింది.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై భారత్, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలు ఎంఓయూ కుదుర్చుకోకముందే ఈ ఒప్పందం గురించి అనిల్ అంబానీకి తెలిసిందని రాహుల్ మండిపడ్డారు. దానికి సంబంధించిన ఈ మెయిల్స్ అంటూ చూపించారు. ప్రధాని మధ్యవర్తిగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ, రిలయెన్స్ డిఫెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

English summary
Reliance Defence has rejected the Congress party charges that its Chairman Anil Ambani had prior information of the Rafale deal and clarified that the leaked email is referring to cooperation between Airbus Helicopter and Reliance not the government to government agreement between France and India for Rafale fighter jets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X