• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Rafale Fighter jet:వీటి కెపాసిటీ స్పెషాలిటీలు ఇవే...!

|
Google Oneindia TeluguNews

అంబాలా: రాఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో అధికారికంగా చేరాయి. సర్వధర్మ పూజా అనంతరం ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి అధికారికంగా చేరాయి. పూజా కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ హాజరయ్యారు. అయితే ఈ అత్యాధునిక యుద్ధ విమానాలు రాఫేల్ సామర్థ్యం గురించి తెలుసుకుందాం.

భారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలుభారత గగనతలంలో రాఫేల్ ఫైటర్ జెట్లు... అంబాలాకు ఎస్కార్ట్ చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలు

 మొత్తం 36 యుద్ధ విమానాలు..

మొత్తం 36 యుద్ధ విమానాలు..

రాఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలోకి అధికారికంగా చేరాయి. అంబాలా ఎయిర్‌బేస్‌లో జరిగిన సర్వధర్మ పూజా కార్యక్రమం అనంతరం ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌లోకి అధికారికంగా చేరాయి. తొలి బ్యాచ్‌లో అయిదు రాఫేల్ యుద్ధ విమానాలను అందించింది ఫ్రాన్స్. మొత్తం 36 రాఫేల్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. జూలై చివరిలో ఫ్రాన్స్‌ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ యుద్ద విమానాలు ఏడు వేల కిలోమీటర్ల దూర ప్రయాణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి. మళ్లీ తమ ప్రయాణాన్ని ఆరంభించాయి.

 ట్విన్ ఇంజిన్స్.. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్..

ట్విన్ ఇంజిన్స్.. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్..

ట్విన్ ఇంజిన్స్‌ గల రాఫేల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఙానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్‌ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు.

 ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే నిరవధికంగా...

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే నిరవధికంగా...

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. ఈ విషయం ఇప్పటికే రుజువైంది కూడా. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి వ్యవస్థలు రాఫేల్‌లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

 తొమ్మిది టన్నులను మోయగల సత్తా ఉన్న ఫైటర్ జెట్

తొమ్మిది టన్నులను మోయగల సత్తా ఉన్న ఫైటర్ జెట్

ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫేల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ విండర్, అపాచి, హర్పూర్, అలారం, పీజీఎం 100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించడానికి రాఫేల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు.

 15.30 మీటర్ల పొడవుతో..

15.30 మీటర్ల పొడవుతో..

రాఫేల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. ఇలాంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫేల్ జెట్ విమనాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 రాఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.

English summary
With a traditional ‘Sarva Dharma Puja’, air display and Sarang aerobatic team’s performance, the first batch of five Rafale fight is being formally inducted into the Indian Air Force (IAF) on Thursday in a mega ceremony in Ambala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X