వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతృదేశాల గుండెల్లో రాఫెల్: యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలు ఇవే.. ధర ఎంతో తెలుసా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు కాస్సేపట్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ల్యాండ్ కాబోతున్నాయి. దేశంలో హాట్ టాపిక్‌గా మారిన ఈ జెట్ ఫైటర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. వైమానిక దళం అమ్ముల పొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా గుర్తింపు పొందాయి రాఫెల్ జెట్స్.

రాఫెల్.. టేకాఫ్: చైనాపై బ్రహ్మాస్త్రం: దుందుడుకు చర్యలకు చెక్: వైమానిక దళంలో.. కాస్సేపట్లోరాఫెల్.. టేకాఫ్: చైనాపై బ్రహ్మాస్త్రం: దుందుడుకు చర్యలకు చెక్: వైమానిక దళంలో.. కాస్సేపట్లో

అయిదింటితో ఆరంభం.. మొత్తం 36 యుద్ధ విమానాలు..

అయిదింటితో ఆరంభం.. మొత్తం 36 యుద్ధ విమానాలు..

సోమవారం ఫ్రాన్స్‌లో టేకాఫ్ తీసుకున్న ఈ యుద్ధ విమానాలు మధ్యాహ్నానికి భారత్‌కు చేరుకోనున్నాయి. తొలి బ్యాచ్‌లో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను అందించింది ఫ్రాన్స్. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఏడు వేలకు పైగా కిలోమీటర్ల దూర ప్రయాణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి. మళ్లీ తమ ప్రయాణాన్ని ఆరంభించాయి.

ట్విన్ ఇంజిన్స్.. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్..

ట్విన్ ఇంజిన్స్.. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్..

ట్విన్ ఇంజిన్స్‌ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఙానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్‌ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు.

 ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే..

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే..

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. ఈ విషయం ఇప్పటికే రుజువైంది కూడా. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

తొమ్మిది టన్నులను మోయగల సత్తా..

తొమ్మిది టన్నులను మోయగల సత్తా..

ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ విండర్, అపాచి, హర్పూర్, అలారం, పీజీఎం 100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు.

Recommended Video

Rafale Fighter Jets Take Off from France To India | Oneindia Telugu
15.30 మీటర్ల పొడవుతో..

15.30 మీటర్ల పొడవుతో..

రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. ఇలాంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది.

English summary
The first batch of five Rafale fighter jets to be inducted into the Indian Air Force (IAF) on July 29. The Rafale fighter jet will be the most advanced fighter aircraft in the IAF's fleet. Rafale is a twin-jet combat aircraft manufactured by Dassault Aviation. The aircraft is intended to perform air supremacy, interdiction, aerial reconnaissance, ground support, in-depth strike, anti-ship strike and nuclear deterrence missions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X