వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజసంగా రాఫెల్ చేరిక: ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ చీఫ్ గెస్ట్, సర్వ ధర్మ పూజ.. అన్నీ మతాల పెద్దలు..

|
Google Oneindia TeluguNews

భారత వైమానిక దళంలో అమ్ములపొదిలో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. వాస్తవానికి జూలై 29వ తేదీన హర్యానాలో ఎయిర్‌బేస్‌కి విమానాలు చేరుకున్నాయి. కానీ గురువారం చేరిక ప్రక్రియ జరుగుతోంది. భారత, ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ అఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భాదౌరియా, డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

Recommended Video

Rafale Jets formally Inducted into IAF’s 17 Squadron 'Golden Arrows' || Oneindia Telugu
సర్వ ధర్మ పూజ..

సర్వ ధర్మ పూజ..

అంబాలా ఎయిర్ బేస్ వద్దకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీకి అంబాలాలో గార్డ్ ఆఫ్ హానర్ గౌరవం దక్కింది. తర్వాత సర్వ ధర్మ పూజను సారంగ్ ఏరోబాటిక్ టీం నిర్వహిస్తోంది. రాఫెల్ యుద్ధవిమానాలు భారత అమ్ములపొదిలో చేరడంతో.. వైమానిక దళ సామర్థ్యం మరింత పెరిగింది. డ్రాగన్, పాకిస్తాన్ లాంటి దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేస్తోంది.

అన్నీ మతాల పెద్దలు

అన్నీ మతాల పెద్దలు

ఉదయం 8. గంటల సమయంలో ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రి ప్లోరెన్స్ పార్లీ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ రాజ్‌నాథ్ సింగ్‌తో తేనీటి విందు తీసుకున్నారు. తర్వాత ఇద్దరు పాలెం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి అంబాలాకు బయల్దేరారు. ఉదయం 10.25 గంటలకు అంబాలా ఎయిర్ బేస్ చేరుకున్నారు. వారికి వైమానిక దళం స్వాగతం పలికింది. ఉదయం 10.30 గంటలకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు పెద్దలు సర్వ ధర్మ పూజను నిర్వహించారు. జూలై 29వ తేదీ మాదిరిగానే రాఫెల్ యుద్ద విమానాలకు వాటర్ క్యానన్ సెల్యూట్ చేశారు.

మరో 31 రావాల్సి ఉంది..

మరో 31 రావాల్సి ఉంది..

ఫ్రాన్స్ నుంచి ఐదు యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్సులోని మెరిగ్నాక్‌ వైమానిక కేంద్రం నుంచి 5 రాఫెల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

English summary
Sarva Dharma Puja at Ambala airbase: traditional ‘Sarva Dharma Puja’, air display and Sarang aerobatic team’s performance at Ambala airbase.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X