వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2002 నుంచి 2019 వరకు : రాఫెల్ పుట్టుక నుంచి తుది తీర్పు వరకు టైమ్‌లైన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్ వివాదానికి సంబంధించి దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లు కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఇక రివ్యూ పిటిషన్లను విచారణ చేసిన సుప్రీంకోర్టు రాఫెల్‌కు సంబంధించిన అన్ని అంశాలు అంటే ధరలు, రాఫెల్ కేసులో లీకైన డాక్యుమెంట్లు, రక్షణశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ లాంటి అంశాలన్నిటినీ విచారణ చేసింది. దేశాన్ని కుదిపేసిన రాఫెల్ అంశంకు సంబందించిన పూర్వాపరాలు లేదా టైమ్‌లైన్ ఇలా ఉంది.

తొలి రాఫెల్ యుద్ధ విమానంను అందుకున్న భారత వాయుసేనతొలి రాఫెల్ యుద్ధ విమానంను అందుకున్న భారత వాయుసేన

2002లో రాఫెల్‌కు తొలి అడుగులు

2002లో రాఫెల్‌కు తొలి అడుగులు

డిసెంబర్ 30 2002: యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

28 ఆగష్టు 2007: 126 మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ప్రతిపాదనలు కోరుతూ రక్షణశాఖ నోటిఫికేషన్ జారీ

4 సెప్టెంబర్ 2008 : రిలయన్స్ ఏరోస్పేట్ టెక్నాలజీస్ పేరుతో కొత్త కంపెనీ స్థాపించిన ముఖేష్ అంబానీ

మే 2011 : రాఫెల్, యూరో ఫైటర్ జెట్‌లను ఎంపిక చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

30 జనవరి 2012: దస్సో సంస్థకు చెందిన తక్కువ ధరతో తమ రాఫెల్ యుద్ధ విమానాలను అందించేందుకు ముందుకొచ్చింది

13 మార్చి 2014: రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి భారత్‌కు చెందిన డిఫెన్స్ కంపెనీ హాల్ ఫ్రాన్స్ కంపెనీ దస్సోల మధ్య కుదిరిన ఒప్పందం. ఇందులో భాగంగా 108 యుద్ధ విమానాలకు సంబంధించి 70 శాతం పనులను హాల్ పూర్తి చేయాల్సి ఉండగా 30శాతం పనులను దస్సో సంస్థ పూర్తి చేసేలా కుదిరిన ఒప్పందం

ఫ్రాన్స్‌తో కొత్త ఒప్పందం

ఫ్రాన్స్‌తో కొత్త ఒప్పందం

8 ఆగష్టు 2014: ప్రస్తుతం 18 యుద్ధ విమానాలను ఒప్పందం కుదుర్చుకున్న నాలుగేళ్లలో అందజేయనుండగా మిగతా విమానాలను రానున్న ఏడేళ్లలో అందజేస్తారని నాటి రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రకటించారు.

8 ఏప్రిల్ 2015: దస్సో కంపెనీ, రక్షణశాఖ, హాల్ కంపెనీల మధ్య పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయంటూ ఆనాటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి ప్రకటన

10 ఏప్రిల్ 2015: 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

26 జనవరి 2016: భారత్ ఫ్రాన్స్‌ల మధ్య 36 యుద్ధ విమానాల కొనుగోలుకు కుదిరిన ఒప్పందం

23 సెప్టెంబర్ 2016: ఇరు దేశాల మధ్య ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందం

18 నవంబర్ 2016: ఒక్క రాఫెల్ యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఏప్రిల్ 2022 నాటికల్లా భారత్‌కు అప్పగిస్తారంటూ పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటన

కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ పిల్

కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ పిల్

31 డిసెంబర్ 2016: దస్సో సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 36 యుద్ధ విమానాలకు చెల్లించిన అసలు ధర రూ. 60వేల కోట్లు. ఈ ధర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన ధరకంటే రెట్టింపుగా ఉండటం విశేషం

13 మార్చి 2018 : స్వతంత్ర విచారణ సంస్థచే కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

5 సెప్టెంబర్: 2018 : యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం పిల్‌ను విచారణ చేసేందుకు అంగీకారం తెలిపిన సుప్రీంకోర్టు

18 సెప్టెంబర్ 2018: అక్టోబర్ 10 వరకు రాఫెల్ కొనుగోలుపై స్టే విధిస్తూ కేసును వాయిదా వేసిన కోర్టు

8 అక్టోబర్2018: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివరాలు సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలంటూ కేంద్రానికి న్యాయస్థానం ఆదేశం

10 అక్టోబర్ 2018 : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఎలా నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రక్రియను తెలుపుతూ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి ఆదేశం

ధరలకు సంబంధించి సీల్డు కవర్లో కోర్టుకు ఇచ్చిన కేంద్రం

ధరలకు సంబంధించి సీల్డు కవర్లో కోర్టుకు ఇచ్చిన కేంద్రం


24 అక్టోబర్ 2018: కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు రాఫెల్‌ కొనుగోలులో అవకతవకలు జరిగాయని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

31 అక్టోబర్ 2018: 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ధరల వివరాలను సీల్డు కవర్‌లో న్యాయస్థానం ముందు ఉంచాలని కోర్టు కేంద్రానికి ఆదేశం

12 నవంబర్ 2018 : రాఫెల్ యుద్ధ విమానాల ధరల విషయం, నిర్ణయ ప్రక్రియను సుప్రీంకోర్టుకు సీల్డు కవర్లో సమర్పించిన కేంద్రం

14 నవంబర్ 2018: రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ఆర్డర్‌ను రిజర్వ్ చేసి ఉంచింది

రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

14 డిసెంబర్ 2018: మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఇందులో తప్పుబట్టాల్సింది ఏమీ లేదంటూ చెప్పిన సుప్రీంకోర్టు రాఫెల్‌కు సంబంధించి అన్ని పిటిషన్లను కొట్టివేసింది.

10 ఏప్రిల్ 2019: సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను తిరిగి విచారణ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇందులో భాగంగా లీకైన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

14 నవంబర్ 2019: అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేస్తూ రాఫెల్ వివాదంకు ముగింపు పలికిన న్యాయస్థానం. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒక ఒప్పందం అన్న సంగతిని విస్మరించరాదని చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. అదే సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించేందుకు కోర్టుకు సరైన కారణాలు కనిపించడం లేదంటూ వ్యాఖ్య

English summary
The verdict is out on Rafale. Supreme court in its judgement had cancelled all the review petitions.Here is the time line of Rafale from 2002 December to 2019 November
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X