వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ దేశాన్ని వంచించారు.. రాఫెల్ ఒప్పందంలో ముమ్మాటికీ అవినీతి జరిగింది: రాహుల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

సిగ్గుపడాలి.. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారు..!

ఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు రోజురోజుకీ మంట రాజేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధిస్తున్న ప్రశ్నలతో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోయింది. దీనికి తోడు రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటన మరింత అగ్గి రాజేసింది. తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై రాఫెల్‌కు సంబంధించి ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీలు ఇద్దరు కలిసి భారత రక్షణ వ్యవస్థపై రూ.130వేలకోట్లతో సర్జికల్ దాడులు నిర్వహించారని ఘాటు విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. మనదేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల రక్తాన్ని మోడీ అగౌరవ పర్చారని రాహుల్ ధ్వజమెత్తారు. సిగ్గుపడాల్సి అంశమని రాహుల్ అన్నారు. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారని రాహుల్ విరుచుకుపడ్డారు.

రాఫెల్‌లో అనీల్ అంబానీ కంపెనీ: హోలాండే షాకింగ్ కామెంట్స్!రాఫెల్‌లో అనీల్ అంబానీ కంపెనీ: హోలాండే షాకింగ్ కామెంట్స్!

రాఫెల్ ఒప్పందం విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ ఛీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని దీనికి బాధ్యత వహిస్తూ నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం వివాదంగా మారుతుండటంతో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మీడియాతో మాట్లాడుతూ... రాఫెల్ ఒప్పందంలో భాగంగా భారత్ ప్రభుత్వం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ తమ భాగస్వామ్యంగా ఉందని చెప్పి... ఫ్రాన్స్‌కు స్వతహాగా ఒక కంపెనీని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు.

Rafel issue: Prime Minister had “betrayed India’s soul” says Rahul

2015 ఏప్రిల్ 10న పారిస్‌లో నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలెండే సమక్షంలో 36 రాఫెల్ యుద్ధవిమానాలను రూ.58వేల కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు చర్చల తర్వాత ప్రధాని ప్రకటించారు. ఇందులో భాగంగానే రాఫెల్ యుద్ద విమానాలను తయారు చేస్తున్న దసాల్ట్ సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను తమ భాగస్వామిగా చేసుకుంది. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. " ప్రధాని మోడీ ఈ ఒప్పందంలో రహస్యంగా మార్పులు చేశారు. ఇది ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటనతో మరోసారి స్పష్టమైంది. కొన్ని వేల కోట్ల ఒప్పందం అనిల్ అంబానీకి మోడీ అంటగట్టారు. ప్రధాని మోడీ దేశానికి నమ్మకద్రోహం చేశారు. సైనికుల రక్తాన్ని అగౌరవ పరిచారు"అని రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

English summary
Rahul Gandhi led a blistering Congress attack on Narendra Modi on Saturday as he reiterated that the Prime Minister had “betrayed India’s soul” after former French President Francois Hollande’s remarks contradicted the Indian government’s stand on the Rafale deal.“The PM and Anil Ambani jointly carried out a One Hundred & Thirty Thousand Crore, SURGICAL STRIKE on the Indian Defence forces. Modi Ji you dishonoured the blood of our martyred soldiers. Shame on you. You betrayed India's soul,” he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X