వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ రభస: కొనుగోలు ధరలో తేడా ఉందన్న రక్షణశాఖ జాయింట్ సెక్రటరీ...కాగ్ వద్దకు ఫైల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: సెప్టెంబర్ 2016లో ఆనాటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్‌ల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అయితే అంతకు నెలముందే ఈ ఒప్పందం చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన రక్షణశాఖ అధికారి ఒకరు రాఫెల్ బెంచ్ మార్క్ ధరపై ఆ ఒప్పందంపై అభ్యంతరం తెలిపినట్లు ఈ సమాచారం తమ వద్ద ఉన్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఆ అధికారి రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ మరియు అక్విజిషన్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపింది.

అభ్యంతరాలు ఉన్న ఫైలును స్టడీ చేస్తున్న కాగ్

అభ్యంతరాలు ఉన్న ఫైలును స్టడీ చేస్తున్న కాగ్

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ రక్షణశాఖ అధికారి ఒప్పందం పై అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఒప్పందంలో జాప్యం జరిగిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. అతని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ప్రభుత్వం సొంత నిర్ణయంతో ఒప్పందం జరిగిపోయిందని తెలిపింది. ఆనాటి జాయింట్ సెక్రటరీ అభ్యంతరాలకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కాగ్ వద్ద ఉంది. ప్రస్తుతం కాగ్ ఆ ఫైలులోని అంశాలను స్టడీ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాగ్ దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు అధికారి అభ్యంతరాలు ఎలా విస్మరించబడ్డాయో కూడా వివరణ ఇవ్వనుంది కాగ్.

Recommended Video

రాఫెల్ డీల్ : రాబర్ట్ వాద్రా పై సంచలన వ్యాఖ్యలు చేసిన గజేంద్ర సింగ్ షెకావత్
 126 రాఫెల్ విమానాల ధర కంటే 32 విమానాల ధరే ఎక్కువ

126 రాఫెల్ విమానాల ధర కంటే 32 విమానాల ధరే ఎక్కువ

ఒప్పంద చర్చల కమిటీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డిప్యూటీ ఛీఫ్ నేతృత్వం వహించారు. దాదాపు డజను సార్లకుపైగా చర్చలు జరిపిన తర్వాత ఫ్రెంచ్ అధికారులతో రాఫెల్ కొనుగోలు ధరపై ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పందం చేసుకున్నారు. అంతకుముందు జాయింట్ సెక్రటరీగా ఉన్న రక్షణశాఖ అధికారి బెంచ్ మార్క్ ధరపై అభ్యంతరం తెలిపారు. 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కంటే 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ధరనే ఎక్కువగా ఎలా ఉంటుందని అభ్యంతరం తెలిపారు. మరోవైపు జర్మనీ కూడా యుద్ధవిమానాల కొనుగోలులో 20శాతం తగ్గిస్తామని కూడా చెప్పింది. జర్మనీ డిస్కౌంట్ ఇస్తామని ముందుకొస్తుంది కాబట్టి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అదే డిస్కౌంట్ ఇవ్వాలని భారత ప్రభుత్వం ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్‌ను కోరింది.

 రాఫెల్ కొనుగోలుకు హడావుడిగా కేంద్రం కేబినెట్ ఆమోదం

రాఫెల్ కొనుగోలుకు హడావుడిగా కేంద్రం కేబినెట్ ఆమోదం


అయితే ఆనాటి జాయింట్ సెక్రటరీ పదవీకాలం ముగిశాక కొత్తగా వచ్చిన జాయింట్ సెక్రటరీతో కేబినెట్ నోట్ తయారు చేయించి 2016 సెప్టెంబర్ మూడో వారంలో హడావుడిగా కేబినెట్ ఆమోదం తెలిపేవరకు వెళ్లింది. అయితే ఫ్రెంచ్ వెబ్‌సైట్ ప్రకారం ముందుగా 126 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత సర్కార్ ఆసక్తి చూపిందని ఆ తర్వాత 2014లో ప్రభుత్వం మారిన తర్వాత కొనుగోలు సంఖ్యను 36 యుద్ధ విమానాలకే పరిమితం చేసినట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వివరణ ఇచ్చినట్లు తెలిపింది. అయితే ఉత్పత్తి ఫ్రాన్స్‌లోనే జరుగుతుంది కాబట్టి ఒక రకంగా పెద్ద డీల్‌ను కోల్పోయామనే బాధ ఉన్నప్పటికీ ఉత్పత్తి ఫ్రాన్స్‌లోనే జరుగుతుందనే విషయం ఆనందం కలిగించిందని హోలాండే చెప్పినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది.

దసాల్ట్ కంపెనీదే నిర్ణయం

దసాల్ట్ కంపెనీదే నిర్ణయం

అంతేకాదు ఆఫ్‌సెట్ పార్ట్‌నర్‌గా రిలయన్స్ డిఫెన్స్ సంస్థ పేరును ప్రతిపాదించి మోడీ సర్కార్ తమకు మరో డిఫెన్స్ కంపెనీ ఎంచుకునే వెసులుబాటు లేకుండా చేసిందని హోలాండే చెప్పినట్లు వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే హోలాండే చెప్పిన మాటల్లో వాస్తవం లేదని... మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్‌సెట్ పార్ట్‌నర్‌గా నియమించుకోవాలన్న నిర్ణయం దసాల్ట్ కంపెనీదే అని ఆ సంస్థ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ క్లారిటీ ఇచ్చారు.

English summary
Nearly a month before the deal for 36 Rafale aircraft was signed between then Defence Minister Manohar Parrikar and his French counterpart in New Delhi in September 2016, a senior officer of the Ministry of Defence, who had been part of the Contract Negotiations Committee (CNC), raised questions about the deal’s benchmark price and put his objections on record, The Indian Express has learnt.This officer was then Joint Secretary & Acquisition Manager (Air) in the MoD and the one meant to initiate the note for the Cabinet’s approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X