వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ రాజీనామా, గవర్నర్‌కు లేఖ అందజేత, ఆపద్దర్మ సీఎంగా కొనసాగింపు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడంతో రాజ్‌భవన్ వచ్చి గవర్నర్ ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్దర్మ సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు.

ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?ఎవరీ సరయూ రాయ్, జార్ఖండ్ సీఎంపైనే ఎందుకు పోటీ, కారణాలివేనా..?

47 సీట్లతో..

47 సీట్లతో..

జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి 47 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటింది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 41 సీట్ల మార్కు దాటిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. కాంగ్రెస్ కూటమి 47 సీట్లు సాధించి, అధికార బీజేపీని విపక్షానికి నెట్టేసింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. జేవీఎంపీ 3, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.

సీఎం ఓటమి..

సీఎం ఓటమి..

జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తన మాజీ క్యాబినెట్ సహచరుడు, సరయూ రాయ్ చేతిలో మట్టి కరిచారు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం సహజం కానీ.. సీఎం, పీఎంలు ఓటమి పాలవ్వడం అరుదు. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం ఆయనకు పెట్టిన కోట. గత 24 ఏళ్ల నుంచి ఆయనకు ఓటమి అంటే ఏంటో తెలియదు. కానీ ఈసారి, తన ప్రత్యర్థి, మాజీ సీఎం సరయూ రాయ్ చేతిలో ఓడిపోయారు.

24 ఏళ్ల నుంచి

24 ఏళ్ల నుంచి

1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నుంచి రఘుబర్ దాస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదుసార్లు రఘువర్ దాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తూర్పు జంషెడ్‌పూర్ నియోజకవర్గం దాస్‌కు పెట్టిన కోట.. కానీ ఈసారి మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి. మొదటి రౌండ్ నుంచి సరయూ రాయ్ ఆధిక్యంలో దూసుకెళ్లారు.

English summary
Raghubar Das tenders resignation as BJP stares at defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X