వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం వద్దు.. ప్రజలను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వండి : సత్యపాల్ మాలిక్‌తో రాహుల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్ మధ్య ట్వీట్ వార్ జరుగుతుంది. ఆర్టికల్ 370 రద్దులో వ్యాలీలో భయానక వాతావరణం నెలకొందని రాహుల్ ట్వీట్ చేయడంతో మాటలయుద్ధం ప్రారంభమైంది. అదేం లేదని .. కావాలంటే కశ్మీర్‌కు వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని గవర్నర్ రాహుల్‌గాంధీని ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కలుగజేసుకొని .. రాహుల్ ఒక్కరే ఎందుకు అఖిలపక్ష సమావేశాన్ని పిలువాలని కోరడంతో మాటల యుధ్దం పీక్‌కి చేరింది. దీనిపై చివరకు రాహుల్ కూడా స్పందించారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు పరిస్థితి ఏం బాగోలేదనే ప్రచారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ స్పందించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మండిపడ్డారు. శ్రీనగర్ రహదారులపైకి 10 వేల మంది కశ్మీరీలు వచ్చి ఆందోళన చేశారనే వార్తలొచ్చాయి. దీంతో ప్రస్తుత పరిస్థితిపై రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందిస్తూ కశ్మీర్‌ రావాలని.. ఒక విమానం కూడా పంపిస్తానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ గాంధీ ప్రతిస్పందించారు. 'అఖిలపక్ష నేతలు, తనను కశ్మీర్‌ పరిస్థితులను పరిశీలించేందుకు పిలిచిన గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు ధన్యవాదాలు. జమ్ముకశ్మీర్, లడఖ్ పర్యటిస్తామన్నారు. కానీ తమ బృందానికి హెలికాప్టర్ ఆరెంజ్ చేయనవసరం లేదన్నారు. కశ్మీర్‌లో సాధారణంగా ప్రయాణించి .. అక్కడి ప్రజలను కలుసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. తాను, మిగతా నేతలు కూడా కశ్మీర్ వచ్చేందుకు సిద్ధం' అని రాహుల్ రీ ట్వీట్ చేశారు.

Rahul ask Jk governer for freedom to meet Kashmiris, forces

రాహుల్ ప్రారంభించిన ట్వీట్ వార్ .. చిలికి చిలికి గాలివానలా మారింది. ఆర్టికల్ 370 రద్దుతో వ్యాలీలో పరిస్థితికి కారణమని రాహుల్ ఆరోపించగా .. సత్యపాల్ మాలిక్ తప్పుపట్టారు. మీరు బాధ్యతయుత గల నేత, ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కావాలంటే స్వయంగా పరిస్థితిని చూసేందుకు కశ్మీర్ రావాలని ఆహ్వానం పలికారు. విమానం కూడా పంపిస్తామని పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ .. రాహుల్ ఒక్కరే ఎందుకు .. అఖిలపక్ష నేతలను కూడా పిలువాలని కోరారు. ఇందుకు మాలిక్ సమ్మతించి .. రాహుల్‌.. మిగతా అఖిలపక్ష నేతలు కశ్మీర్ రావాలని కోరారు. అయితే ఇందుకు రాహుల్ కండీషన్స్ పెడుతూ ట్వీట్ చేయడంతో ట్విట్ట యుద్ధం కొనసాగుతుంది.

English summary
congress leader Rahul Gandhi has responded to Jammu and Kashmir Governor Satya Pal Malik's invite to the valley to observe the ground situation. "Dear Governor Malik, A delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh. We won't need an aircraft but please ensure us the freedom to travel & meet the people, mainstream leaders and our soldiers stationed over there," former Congress President Rahul Gandhi said on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X