వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవి మోడీ ఓటింగ్ మెషీన్లు ... అయినా సరే బీహార్ లో విజయం మాదే ..రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

బీహార్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ నవంబరు 7వ తేదీన జరుగనుంది. ఇంకా ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఒకపక్క బిజెపి నుండి నేడు జేపీ నడ్డా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుండగా, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Bihar elections .. జంగిల్ రాజకుమారుడికి విశ్రాంతినివ్వండి ... తేజస్వి యాదవ్ టార్గెట్ గా జేపీ నడ్డాBihar elections .. జంగిల్ రాజకుమారుడికి విశ్రాంతినివ్వండి ... తేజస్వి యాదవ్ టార్గెట్ గా జేపీ నడ్డా

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ కాదు మోడీ ఓటింగ్ మెషీన్స్ .. రాహుల్ ఫైర్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ కాదు మోడీ ఓటింగ్ మెషీన్స్ .. రాహుల్ ఫైర్

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో దేశంలో రైతులు ఎక్కడికి వెళ్లి అయినా పంటలను అమ్ముకోవచ్చని చెబుతున్నారని, అయితే వెళ్లడానికి రోడ్లు బాగుంటేనే కదా ఎక్కడికైనా వెళ్లి పంటను అమ్ముకునేది అంటూ విమర్శలు గుప్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ ను ఈవీఎం అని కాకుండా మోడీ ఓటింగ్ మెషిన్స్ ఎంవీఎం అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు నితీష్ పాలన పై చాలా ఆగ్రహంగా ఉన్నారని, బీహార్లో బీజేపీ జేడీయూ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసింది నితీష్ సర్కార్

ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసింది నితీష్ సర్కార్

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విరుచుకుపడ్డారు. సీమాంచల్ ప్రాంతంలోని అరియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ, ఉద్యోగాల సమస్యపై ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం నితీష్ కుమార్‌పై వాగ్బాణాలు సంధించారు. నితీష్ కుమార్, మోడీ ఇద్దరూ తమ మునుపటి ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇస్తారని వాగ్దానం చేశారని, అయితే వారు ఇచ్చిన మాటను తప్పారని , ప్రజలను మోసం చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

 బీహార్ లో ఏర్పాటు అయ్యేది మహాకూటమి ప్రభుత్వమే

బీహార్ లో ఏర్పాటు అయ్యేది మహాకూటమి ప్రభుత్వమే

తమను ఇంతగా మోసం చేసిన నితీష్ కుమార్ కు బీహార్ యువత ఓట్లు వేయరు అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మహా కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అందరి ప్రభుత్వంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇది పేదలు, రైతులు, ప్రతి కులం మరియు ప్రతి మతం మరియు ప్రతి జిల్లా ప్రభుత్వం అవుతుందని , మేమంతా రాష్ట్రాన్ని మారుస్తామని, అభివృద్ధిలో ముందుకు నడిపిస్తారని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించిన బీహార్లో ఈసారి మహాకూటమి విజయం సాధించి తీరుతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Senior Congress leader Rahul Gandhi Wednesday called Electronic Voting Machines (EVMs) “Modi Voting Machines” (MVMs) but said the people of Bihar are angry this time and they have decided to oust the BJP-JD(U) government from power in Bihar. He also lashed out at Chief Minister Nitish Kumar, accusing him of having deceived the people of the state on his promise of creating new jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X