వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్ సిటీగా అమేథి, ప్రతీకార రాజకీయలు చేస్తున్నారు: మోడీపై రాహుల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమేథిలో పుడ్ పార్కు ప్రాజెక్టును తొలగించడంపై ఎన్టీఏ ప్రభుత్వ తీరుని తప్పబడుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతికార చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

గత ఏడాది ప్రధాని మోడీ అమేథిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాజకీయ ప్రతీకార చర్యలకు తమ ప్రభుత్వం పాల్పడదని చెప్పారని, కానీ ఈరోజు చేసిందేమిటిని నిలదీశారు. అమేథిలో పుడ్ పార్కును తొలగించడంపై రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ ఫుడ్ పార్కు వల్ల లక్షల మంది రైతులకు ఉపయోగం కలుగుతోందని అలాంటి పార్కును ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించారు. ఫుడ్‌పార్కు లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు.

అంతేకాదు ఈ మెగా పుడ్ పార్కు మూలంగా ఉత్తరప్రదేశ్ లోని అమేథి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో సుమారు 40,000 మందికి జీవనోపాధి కలుగుతుందని అన్నారు. మోడీ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

Rahul Gandhi accuses PM Modi of practicing 'politics of revenge', Govt refutes charge

అంతే కాదు, ఒక రైతు కేజీ ఆలుగడ్డలను రూ. 2లకే అమ్ముతున్నామని, ఒకే ఒక్క ఆలుగడ్డ ఉండే చిప్స్ ప్యాకెట్‌ను మాత్రం మా పిల్లలు రూ. 10కి కొనుగోలు చేసి తింటున్నారని... ఏంటీ ఈ మ్యాజిక్ అని తనని ప్రశ్నించాడని రాహుల్ గాంధీ సభకు వెల్లడించారు.

మరోసారి సభలో రాహుల్ ఛలోక్తులు విసురుతూ మాట్లాడారు. నేనేమీ ప్రధాని మంత్రి వేసుకునే సూట్స్ గురించి మాట్లడటం లేదని, కేవలం అమేథిలో పుడ్ పార్క్‌ను ఎందుకు తొలగించారనే దానిపై మాట్లాడుతున్నానని, మీరంతా శ్రద్ధగా వినాలని అన్నారు.

రూ. 200 కోట్ల విలువతో అక్టోబర్ 2013న అమేథిలో ఈ మెగా పుడ్ పార్కుని కాంగ్రెస్ ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

ఆలుగడ్డ మ్యాజిపై రాజ్‌నాథ్ మాట్లాడుతూ రాహుల్‌కు తెలిసింది కొంచమేనని, ఈ మ్యాజిక్‌ని చేసింది మా ప్రభుత్వం కాదని, యూపీ ప్రభుత్వమేనని తెలిపారు.

స్మార్ట్ సిటీగా అమేథి:

ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతనిధ్యం వహిస్తోన్న అమేథి నియోజకవర్గానికి మహార్దశ పట్టబోతోంది. ఈ నియోజక వర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఈ విషయాన్ని తెలియజేసినట్టు అధికారులు తెలిపారు. అమేథి పరిపాలనా అధికారులకు ఈ మేరకు లేఖ రాశామని ఆ నియోజక వర్గ ఏడీఎం సరోజ్ చెప్పారు. స్మార్ట్ సిటీ నేపథ్యంలో అమేథి ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా, రహదారులు, ఈ గవర్నెన్స్, ప్రపంచ స్ధాయి విద్యా వ్వవస్ధ వంటి సౌకర్యాలు అందించనున్నారు.

ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఖాతా తెరిచారు. రాహల్ ట్విట్టర్ ఖాతాను ఆయన కార్యాలయ సిబ్బంది నిర్వహిస్తారు. అధికారిక ఖాతాగా ట్విట్టర్‌ కూడా ధ్రువీకరించింది. రాహుల్ గాంధీ ఖాతా తెరిచిన గంటలోనే 20 వేల మంది ఫాలోవర్లుగా చేరారు.

English summary
Attacking Centre over its decision of shelving the Amethi Mega Food Park project in 2014, Congress vice president Rahul Gandhi accused Prime Minister Narendra Modi of indulging into politics of revenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X