వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం నిరూపిస్తాం: రాఫెల్ డీల్‌పై రాహుల్ గాంధీ, ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ చౌకీ దార్ పెద్ద దొంగ అని ప్రధాని మోడీని ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితుడు అనిల్ అంబానీకి మోడీ దోచి పెట్టాడని ఆరోపించారు. రాఫెల్ డీల్ పైన జేపీసీ (జాయింట్ పార్లమెంట్ కమిటీ) వేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. రాఫెల్ ధర వివరాలు ఇప్పటికే కాగ్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటికి అందాయని సుప్రీం కోర్టు పేర్కొందని చెప్పారు.

రాఫెల్ డీల్ వివరాలు కాగ్‌కు మాత్రం చేరలేదని చెప్పారు. పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున ఖర్గే ఉన్నారని చెప్పారు. ఆయనకు తెలియకుండా ఈ నివేదిక ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. మన పార్లమెంటులో కాకుండా ఫ్రెంచ్ పార్లమెంట్‌లో దీనిని ప్రవేశ పెట్టారా అని నిలదీశారు. మన చౌకీదార్ చోర్ అని దేశం మొత్తానికి అర్థమైందని వ్యాఖ్యానించారు.

వివిధ అంశాలపై కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే మాట్లాడుతారని, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఏమీ మాట్లాడరని చెప్పారు. ఓ ఎయిర్ క్రాఫ్ట్ ధర రూ.526 కోట్ల నుంచి రూ.1600 కోట్లకు పెరిగిందని ఆరోపించారు.

Rahul Gandhi After Rafale Verdict: Will Prove PM Helped Anil Ambani

రాఫెల్ డీల్‌లో విషయంలో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చింది. అయినప్పటికీ రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. జేపీసీ వేస్తే తాము నిరూపిస్తామని వ్యాఖ్యానించారు. జేపీసీ వేస్తే అనిల్ అంబానికి సహకరించినట్లుగా నిరూపిస్తామని చెప్పారు.

English summary
Congress President Rahul Gandhi: How can it be possible that the foundation of SC judgement saying that pricing has been discussed in CAG report...PAC chairman (M Kharge) is sitting here, how come he never saw it. No one in PAC ever saw it. But Supreme Court saw it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X