వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నే ఆపుతారా?: కారు దిగి ఆవేశంతో ఊగిపోయిన రాహుల్ గాంధీ

మధ్య ప్రదేశ్‌లోని మాండ్‌సోర్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకునేందుకు కారులో వెళ్తున్న సమయంలో రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు మధ్యప్రదేశ్‌-రాజస్థాన్‌ సరిహద్దులో ఆపేశారు.

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని మాండ్‌సోర్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను కలుసుకునేందుకు కారులో వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు మధ్యప్రదేశ్‌-రాజస్థాన్‌ సరిహద్దులో ఆపేశారు.

రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

దీంతో రాహుల్ గాంధీ ఆవేశంగా కారు దిగారు. మీడియా ప్రతినిధులు, పోలీసులను తోసేసుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లబోయారు. ఆ సమయంలో రాహుల్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను ఎలా ఆపుతారంటూ నిలదీశారు. కోపంగా నడుచుకుంటూ వెళ్లిపోయిన రాహుల్‌ బైక్ పైన బయలుదేరారు. ఆ ప్రయత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

Rahul Gandhi allowed to meet kin of farmers killed by police at MP-Rajasthan border

దీనిని అడ్డుకోవడంతో నడిచి కొద్ది దూరం వెళ్లారు. అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తూ సెక్షన్‌ 144ను ఉల్లంఘించినందుకు రాహుల్‌ను అరెస్టు చేసినట్లు అడిషనల్‌ డీజీపీ వి మధుకుమార్‌ తెలిపారు.

రాహుల్‌, శరద్‌యాదవ్‌, కమల్‌నాథ్‌, సచిన్‌పైలెట్‌, గిరిజా వ్యాస్‌ ఇతర నేతలను అరెస్టు చేసి విక్రం సిమెంట్‌ ఫ్యాక్టరీ గెస్ట్‌ హౌస్‌కు తరలించారు. ఆ తర్వాత నాలుగు గంటలకు ఆయనను విడుదల చేశారు. కాగా, ఆ తర్వాత చనిపోయిన రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ - రాజస్థాన్ సరిహద్దుల్లో కలవనున్నారు.

English summary
Rahul Gandhi allowed to meet kin of farmers killed by police at MP-Rajasthan border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X