• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్కంఠకు బ్రేక్.. రాహుల్ అమేథి నామినేషన్ ఓకే..!

|

అమేథి : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఒకటి ప్లస్, ఒకటి మైనస్ అన్నట్లుగా తయారైంది. చౌకీదార్ చోర్ హై కామెంట్లపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన కొద్దిగంటల్లోనే ఆయన అమేథి నామినేషన్ కు ఆమోదముద్ర పడింది. అమేథి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ధృవ్‌లాల్ ఆయనపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ క్షుణ్ణంగా పరిశీలించేంత వరకు ఆమోదించొద్దని కోరారు.

అమేథి ఫియర్.. డౌట్ క్లియర్

అమేథి ఫియర్.. డౌట్ క్లియర్

లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతటా బిజీబిజీగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇటు అమేథి నుంచే కాకుండా అటు కేరళలోని వాయనాడ్ నుంచి బరిలో నిలిచారు. అదలావుంటే అమేథి పార్లమెంటరీ స్థానానికి రాహుల్ ఈనెల 10వ తేదీన నామినేషన్ వేశారు. అయితే ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి ధృవ్‌లాల్ కంప్లైంట్ చేశారు. అంతేకాదు రాహుల్ నామినేషన్ తిరస్కరించాలని కోరారు.

చౌకీదార్ చోర్ హై కామెంట్స్..! సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ సారీ

నామినేషన్ లో తప్పులున్నాయట..!

నామినేషన్ లో తప్పులున్నాయట..!

రాహుల్ గాంధీ భారతీయుడు కాదని ఆరోపించిన ధృవ్‌లాల్.. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడంటూ ధ్వజమెత్తారు. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉన్నట్లు అక్కడి కంపెనీ వివరాలను బట్టి తెలుస్తోందన్నారు. అంతేకాదు సదరు కంపెనీకి సంబంధించిన వివరాలను ఎలక్షన్ అఫిడవిట్‌లో రాహుల్ గాంధీ ప్రస్తావించలేదని ఆరోపణాస్త్రాలు సంధించారు.

ఆయన సమర్పించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పత్రాలలోనూ తప్పులున్నాయని పేర్కొన్నారు.

నామినేషన్ ఓకే.. గెలుపు పరిస్థితేంటో..!

నామినేషన్ ఓకే.. గెలుపు పరిస్థితేంటో..!

RAUL VINCI పేరు గల విద్యార్హత పత్రాలు సమర్పించారని.. రాహుల్ గాంధీ పేరుతో ఆయనకు చదువుకున్న ధృవీకరణ పత్రాలు లేవంటున్నారు ధృవ్‌లాల్. అంతేకాదు రావుల్ విన్సీ, రాహుల్ గాంధీ ఒక్కరేనా.. లేదంటే వేర్వేరు వ్యక్తులా అని ప్రశ్నించారు. మొత్తానికి ధృవ్‌లాల్ అభ్యంతరాలతో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలించడానికి గడువు తీసుకున్నారు రిటర్నింగ్ అధికారి. రాహుల్ నామినేషన్ పత్రాల పరిశీలనను సోమవారం నాటికి వాయిదా వేశారు. ఇవాళ రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు పరిశీలించి, అన్ని వివరాలు సరిగానే ఉన్నాయని తేల్చారు.

రాహుల్ గాంధీ నామినేషన్ పై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. ఆయన నామినేషన్ కు ఆమోద ముద్ర లభిస్తుందా లేదంటే తిరస్కరణకు గురవుతుందా లాంటి వాదనలు సోషల్ మీడియాలో జోరుగా సాగాయి. చివరకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన నామినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్కంఠకు బ్రేక్ పడింది. ఇక మే 6వ తేదీన జరిగే అమేథి పోరు ఎలా ఉండబోతుందో చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a big relief to Congress President Rahul Gandhi, the Election Commission on Monday accepted his nomination papers from Amethi Lok Sabha constituency. Earlier, Amethi Returning Officer Ram Manohar Mishra had ordered the postponement of scrutiny of the Congress president's nomination papers to April 22. An Independent candidate, Dhruv Lal, had filed a complaint alleging discrepancies in Gandhi's candidature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more