వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వు మోడీ: రాఫెల్ స్కాంపై మరోసారి రాహుల్, ఐఏఎఫ్‌కు కంగ్రాట్స్

|
Google Oneindia TeluguNews

భారత వైమానిక దళం అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఐఏఎఫ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు జరిగిన సంగతి తెలిసిందే.

ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం వ్యయం ఎందుకు పెరిగిందని రాహుల్ గాంధీ అడిగారు. రూ.526 కోట్ల విమానానికి రూ.1670 కోట్లు ఎందుకు చెల్లించారని నిలదీశారు. ఇదివరకు 126 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. మరీ కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారన్నారు.

Rahul Gandhi asks Centre three questions on Rafale fighter jets..

Recommended Video

V Haumantharao Slams BJP & Also Requested AICC To Recognise Party Workers

రాఫెల్ యుద్ధ విమానాలు రూపొందించిన డసాల్ట్ కంపెనీతో రియలయన్స్ డిఫెన్స్ కంపెనీ కాంట్రాక్ట్ కుదుర్చుకొంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై రాహుల్ గాంధీ తప్పుపట్టారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉండగా... అంబానీకి కాంట్రాక్ట్ ఇవ్వడంతో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చౌకీదార్ చోర్ హై.. (కాపాలాదారు దొంగలా మారాడు) అని ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
Congratulations to Indian Air Force for Rafale,” rahul gandhi tweeted. can Government of India answer Why each aircraft costs ₹1670 Crores instead of ₹526 Crores?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X