వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోండి, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరిన రాహుల్ గాంధీ..

|
Google Oneindia TeluguNews

రాజస్థాన్‌లో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఇద్దరు దళిత యువకులపై అమానుషంగా దాడి చేయడాన్ని ఖండించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

నాగౌర్ జిల్లా పాంచౌడీ పోలీసుస్టేషన్ పరిధిలోని కరణులో ఘటన జరిగింది. ఈ నెల 16వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో ట్రోల్ అవుతోంది. బైక్ సర్వీసింగ్ సెంటర్‌లో తన వాహనం సర్వీసింగ్‌కు ఇచ్చిన యువకులు క్యాష్ కౌంటర్ సమీపంలో కూర్చొన్నారు. అయితే యాజమాని, సర్వీసింగ్ సెంటర్ యువకులు నగదు దొంగిలించారని అనుమానించారు. అంతేకాదు ఒళ్లు హునమయ్యేలా దాడి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Rahul Gandhi asks Cong govt in Rajasthan to take action of Thrashing Dalits

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వానికి విన్నవించారు. వెంటనే చర్యలు తీసుకొని.. బాధితులకు న్యాయం చేయాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి స్పష్టంచేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. ఇలా బలహీనవర్గాలపై దాడులు జరుగుతాయని బీజేపీ నేతలు విమర్శలకు మరింత పదును పెట్టారు.

English summary
Congress leader Rahul Gandhi on two young Dalits in Rajasthan's Nagaur as "horrific and sickening" and asked his party government in the state to take immediate action to bring the perpetrators to book
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X