వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టువీడని రాహుల్.. త్వరలో కాంగ్రెస్‌కు కొత్త ప్రెసిడెంట్?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పట్టువీడని రాహుల్.. కాంగ్రెస్‌కు కొత్త ప్రెసిడెంట్..?? || Oneindia Telugu

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేసిన కేవలం 52సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. 2014తో పోలిస్తే కేవలం ఆరు సీట్లు మాత్రమే పెరగడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీ శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ తిరస్కరించినా రాహుల్ పట్టు వీడటంలేదని సమాచారం.

కర్ణాటక ప్రభుత్వం కూలిపోతే తాను పార్టీకి రాజీనామ చేస్తా ... సిద్దరామయ్యకర్ణాటక ప్రభుత్వం కూలిపోతే తాను పార్టీకి రాజీనామ చేస్తా ... సిద్దరామయ్య

రంగంలోకి సీనియర్లు

రంగంలోకి సీనియర్లు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుందాని సీనియర్లు నచ్చజెపుతున్నా రాహుల్ గాంధీ మాత్రం రాజీనామా ఆమోదించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు సోమవారం ఆయనతో భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్‌ బాధ్యతలు కొత్తవారికి ఇవ్వాల్సిందేనని, అది కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తి అయితే బాగుంటుందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోసారి భేటీకానున్న సీడబ్ల్యూసీ

మరోసారి భేటీకానున్న సీడబ్ల్యూసీ

రాహుల్ గాంధీ నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాలుగైదు రోజుల్లో మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొత్త ప్రెసిడెంట్ ఎంపికకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈలోపు నిర్ణయం మార్చుకుంటే రాహుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు. లేనిపక్షంలో సీడబ్ల్యూసీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వస్తున్నాయి.

సోనియా, ప్రియాంకకు అవకాశం

సోనియా, ప్రియాంకకు అవకాశం

కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు గాంధీ వంశానికి చెందిన వ్యక్తులే ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రాజీనామా చేసినా అదే సంప్రదాయాన్ని కొనసాగించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నారు. రాహుల్ నిర్ణయం మార్చుకోని పక్షంలో మరోసారి సోనియా లేదా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

English summary
Congress's Rahul Gandhi has categorically said that the party will have to find a new chief as he won't change his mind about stepping down from the post of the party chief. Mr Gandhi, who informed the party about his decision to quit following the party's decimation in the Lok Sabha polls, has refused to meet the party's newly-elected lawmakers who called on him. All his meetings and appointments have been cancelled, though he met two envoys from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X