వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత లేదు: ఫ్రీ వ్యాక్సిన్‌పై రాహుల్.. బీజేపీ హామీపై విమర్శలు

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో తమ పార్టీ అధికారంలోక వస్తే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని బీజేపీ పేర్కొన్నది. ఈ మేరకు మేనిఫెస్టోలో ప్రముఖంగా ప్రస్తావించింది. ఇవాళ పాట్నాలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని హామీపై విపక్షాలు ఒంటి కాలిపై లేచాయి.

కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ ఉచితంగా ఇస్తామని బీహార్ బీజేపీ ప్రకటించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఉచిత వ్యాక్సిన్ హామీ పెద్ద బూటకం అని రాహుల్ విమర్శించారు. ఎన్నికలు జరగేదీ ఎప్పుడు? వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడు? వీళ్లు ఇచ్చేది ఎప్పుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకా రాని వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

rahul gandhi condemns bjp free vaccine assurance in bihar

ఒకవేళ బీహార్‌లో ఉచితంగా ఇస్తే దేశమంతా ఉచితంగా ఎవరు ఇస్తారు అని నిలదీశారు. బీహార్‌లో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీపై తమిళనాడు సీఎం పళనిస్వామి ముందుగా ప్రకటన చేశారు. వ్యాక్సిన్ వస్తే ఫ్రీగా ఇచ్చేస్తామని ఆయన కూడా వెల్లడించారు. భారత్ లోనే కాదు, అమెరికాలో వ్యాక్సిన్ పేరుతో నేతలు హామీలు ఇస్తున్నారు.

అందరికంటే ముందు అమెరికన్లకే వ్యాక్సిన్ ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. మార్కెట్లోకి రాని వ్యాక్సిన్ ను అమెరికన్లకు ఎలా ఇస్తారని ట్రంప్ ప్రత్యర్థి జో బిడెన్ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారిద్దరి మధ్య మాటలయుద్ధం జరుగుతోంది.

English summary
congress leader rahul gandhi condemns bjp free vaccine assurance in bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X