వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభద్రతలో యూపీ ప్రభుత్వం.. అందుకే ప్రియాంకను అరెస్ట్ చేశారన్న రాహుల్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకోవడంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యోగి ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రియాంకను అరెస్ట్ చేయలేదని యూపీ పోలీసులు చెబుతున్నా.. రాహుల్ మాత్రం ట్విట్టర్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

యోగిని పొగిడిన ప్రియాంక గాంధీ .. ఎందుకో తెలుసా..?యోగిని పొగిడిన ప్రియాంక గాంధీ .. ఎందుకో తెలుసా..?

అభద్రతకు నిదర్శనం

అభద్రతకు నిదర్శనం

సోంభద్రలో ప్రియాంకను అక్రమంగా అరెస్ట్ చేయడం ఆందోళనకరమని రాహుల్ అభిప్రాయపడ్డారు. తమ సొంత భూమి నుంచి వెళ్లేందుకు నిరాకరించిన 10 మంది ఆదివాసీలను అతిదారుణంగా కాల్చి చంపారని విమర్శించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను పోలీసులు అడ్డుకోవడం యూపీలో బీజేపీ ప్రభుత్వ అభద్రతాభావం పెరుగుతోందనడానికి నిదర్శనమని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధఇంచి రాహుల్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

గ్రామపెద్ద కాల్పుల్లో 10 మంది మృతి

గ్రామపెద్ద కాల్పుల్లో 10 మంది మృతి

రెండు రోజుల క్రితం సోంభద్ర జిల్లాలోని ఉబ్బా అనే ఊరిలో గ్రామ పెద్ద, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో 10 మంది మృతి చెందారు. 36 ఎకరాల భూమిని గ్రామపెద్ద ఆక్రమించుకునేందుకు వెళ్లగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామపెద్ద అనుచరులతో కలిసి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ప్రాణఆలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.

ప్రియాంకను అరెస్ట్ చేసినట్లు పుకార్లు

ప్రియాంకను అరెస్ట్ చేసినట్లు పుకార్లు

సోంభద్రకు వెళ్తున్న ప్రియాంకను అరెస్ట్ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో యూపీ డీజీపీ స్పందించారు. ఆమెను అరెస్ట్ చేయలేదని, సోంభద్రలో 144 సెక్షన్ విధించినందున ప్రియాంకను అక్కడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని స్పష్టం చేశారు.

English summary
Hitting out at the Uttar Pradesh government after Priyanka Gandhi was stopped from proceeding towards Sonbhadra to meet the victims of a clash, Congress leader Rahul Gandhi said the arrest was an arbitrary use of power by the Yogi Adityanath government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X