వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్దార్ పటేల్ నిర్మించిన వ్యవస్థలను మోడీ కుప్పకూల్చారు: రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు పటేల్ నిర్మించిన వ్యవస్థలను నరేంద్ర మోడీ సర్కార్ కుప్పకూల్చిందని మండిపడ్డారు.

పటేల్ నిర్మించిన సంస్థలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం విస్మయం కలిగించిందని పేర్కొన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలను వ్యూహాత్మకంగా ధ్వంసం చేయడం రాజద్రోహం కంటే తక్కువ ఏమీ కాదని చెప్పారు. అంతేకాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ వ్యక్తిగా పేర్కొన్నారు.

Recommended Video

పటేల్ విగ్రహం నవ భారతానికి ప్రతీక.. భావితరాలకు స్ఫూర్తి : మోదీ

సర్దార్ పటేల్ విగ్రహం వెనకున్న అసలైన ఉక్కుమనిషి ఈయనే..!సర్దార్ పటేల్ విగ్రహం వెనకున్న అసలైన ఉక్కుమనిషి ఈయనే..!

సీబీఐ, ఆర్బీఐలలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీబీఐలలో ఉన్నతాధికారుల మధ్య వివాదం, పరస్పరం అవినీతి ఆరోపణలతో సుప్రీం కోర్టు న్యాయస్థానం దర్యాఫ్తు ఏఝెన్సీని చక్కదిద్దేందుకు చొరవ చూపాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

Rahul Gandhi: Congressman Sardar Patel had no tolerance for bigotry or communalism

ఆర్బీఐలో సెక్షన్ 7 ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే వార్తలు కూడా దుమారం రేపాయి. కేంద్ర బ్యాంకులలో ప్రభుత్వం జోక్యంపై ఆందోళనలు వ్యక్తమైన క్రమంలో ఆర్బీఐ స్వతంత్రను కాపాడుతామని కేంద్రం వివరణ ఇచ్చింది.

English summary
On a day Prime Minister Narendra Modi inaugurated a 182-metre statue of Sardar Vallabhai Patel, the world’s tallest, Congress president Rahul Gandhi, in a subtle dig at the BJP, said the Iron Man of India was a Congressman who had no tolerance for bigotry or communalism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X