బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ గాంధీతో రెబల్ ఎమ్మెల్యేలు భేటీ, స్పష్టమైన హామీ లేదు, బ్రైన్ వాష్, సర్దుకుపోండి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కలేదని నిరసన వక్తం చేస్తున్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కర్ణాటకకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం భేటీ అయ్యి చర్చించారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. అనంతరం రాహుల్ గాంధీ ఎమ్మెల్యేల రెబల్ నాయకుడు ఎంబి. పాటిల్ తో ప్రత్యేకంగా చర్చించారని తెలిసింది. రాహుల్ గాంధీ, ఎంబి. పాటిల్ రహస్య చర్చల వివరాలు బయటకురాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Rahul Gandhi ensures suitable portfolio to MB Patil in Karnataka

విశ్వనీయ సమాచారం మేరకు ఎంబి. పాటిల్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి స్పష్టం అయిన హామీ ఇవ్వలేదని, ప్రస్తుతానికి సమస్య పరిష్కారం కావడానికి కొన్ని హామీలు ఇచ్చిందని సమాచారం. కర్ణాటకలో సీనియర్ నాయకుల్లో మీరు ఒకరు అని రాహుల్ గాంధీ ఎంబి. పాటిల్ కు గుర్తు చేశారని సమాచారం.

2019 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచెయ్యాలని, మంత్రి పదవితో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రాహుల్ గాంధీ ఎంబి. పాటిల్ కు బ్రైన్ వాష్ చేశారని తెలిసింది. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుకు నడిపించాలని రాహుల్ గాంధీ ఎంబి, పాటిల్ కు సూచించారని సమాచారం.

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంలో ప్రస్తుతానికి ఎంబి. పాటిల్ కు మంత్రి పదవిలేనట్లే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎంబీ. పాటిల్ బెంగళూరు వచ్చిన తరువాత ఏం నిరణయం తీసుకుంటారో తెలియడం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు.

English summary
Karnataka Cabinet: Rahul Gandhi ensures suitable portfolio to MB Patil, Karnataka Cabinet Expansion: AICC president Rahul Gandhi ensures a responsible portfolio in cabinet to MLA M B Patil. Patil met Rahul Gandhi today in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X