వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: రాహుల్ గాంధీకి నల్లజెండాల సెగ, బళ్లారిలో కాలు పెడితే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటనకు నల్లజెండాలతో స్వాగతం చెప్పి నిరసన వ్యక్తం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మమ్మల్నే అవమానిస్తున్నారని, ఈ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. బళ్లారి జిల్లాలో కాలు పెట్టిన వెంటనే నిరసన వ్యక్తం చస్తామని అంటున్నారు

 సదాశివ కమిషన్

సదాశివ కమిషన్


న్యాయమూర్తి సదాశివ కమిషన్ నివేదిక అమలు చెయ్యాలని దళితులు చాలకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం న్యాయమూర్తి సదాశివ కమిషన్ నివేదిక గురించి పట్టించుకోకపోవడంతో దళిత సంఘాలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి.

 బళ్లారిలో కాలుపెడితే !

బళ్లారిలో కాలుపెడితే !


ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ బళ్లారిలోని హోస్ పేట్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. బళ్లారిలో రాహుల్ గాంధీ అడుగుపెట్టిన వెంటనే ఐదు వేల మందితో నల్లజెండాలతో స్వాగతం చెప్పి నిరసన వ్యక్తం చేస్తామని న్యాయమూర్తి సదాశివ కమిషన్ నివేదిక కమిటి జారీ పోరాట సమితి నాయకులు హెచ్చరించారు.

 మూడు రోజులు అంతే

మూడు రోజులు అంతే

గురువారం బళ్లారిలో న్యాయమూర్తి సదాశివ కమిషన్ నివేదిక కమిటి జారీ పోరాట సమితి నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దళితులు ప్రత్యేక ఓటు బ్యాంకు అని గుర్తు చేశారు. మా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన సీఎం సిద్దరామయ్య ఇప్పుడు దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

 రాహుల్ గాంధీకి సెగ

రాహుల్ గాంధీకి సెగ

బళ్లారి, హోస్ పేట, కలబుర్గి, కోప్పళ, రాయచూరు, యాదగిరి, బీదర్, హైదరాబాద్ కర్ణాటకలోని జిల్లాల్లో ప్రతి చోట రాహుల్ గాంధీకి ఐదు వేల మందికిపైగా నల్లజెండాలతో స్వాగతం పలికి నిరసన వ్యక్తం చేస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

 మీరు యువకులు

మీరు యువకులు

రాహుల్ గాంధీ మీరు యువకులు, ఇప్పటికైనా దళితుల ఆవేదన గుర్తించి న్యాయమూర్తి సదాశివ కమిషన్ నివేదిక అమలు చెయ్యాలని సీఎం సిద్దరామయ్యకు సూచించాలని మనవి చేశారు. న్యాయమూర్తి సదాశివ కమిషన్ అమలు చెయ్యాలని కర్ణాటకలోని అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.

English summary
Karnataka assembly Elections 2018: AICC president Rahul Gandhi is scheduled to tour Kanrataka from Feb 10. But, Dalit associations are planning a protest rally against him during his visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X