వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు మరో షాక్..నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ నోటీస్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసింది. అమేథీ నియోజకవర్గంలో రాహుల్ ఫోటోలతో కూడిన ఏడు బ్యానర్ల ఏర్పాటు చేసినట్లు ప్లయింగ్ స్క్వాడ్ బృందం గుర్తించింది. ఆ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం పేరుతో ఇప్పుడు న్యాయం జరుగుతుంది అన్న నినాదాలు బ్యానర్లపై రాసి ఉండటంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది.

బ్యానర్ల ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు స్థానిక అధికారుల అనుమతి తీసుకోలేదని ఈసీ దర్యాప్తులో తేలింది. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు భారీ బ్యానర్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతి పత్రాలు చూపాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరింది. అయితే వారు పర్మిషన్ తీసుకోకపోవడంతో అధికారులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ విషయాన్ని నోటీసులో పేర్కొన్న ఎన్నికల సంఘం కాంగ్రెస్ ప్రెసిడెంట్ వివరణ కోరింది. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

సమరానికి సిద్ధమైన తలైవా!.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని రజనీ ప్రకటన!సమరానికి సిద్ధమైన తలైవా!.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని రజనీ ప్రకటన!

Rahul Gandhi Gets Election Body Notice
English summary
The Election Commission of India sent a notice to Congress chief Rahul Gandhi today, for violation of Model Code of Conduct, over banners put up in family stronghold Amethi on Wednesday.The banners, which had a picture of Rahul Gandhi, said, "Ab hoga nyay". Rahul Gandhi has been asked to reply to the Election Commission's notice in 24 hours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X