వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ గురించి ఆచి తూచి కామెంట్ చేయండి, నోరు జారొద్దు, కాంగ్రెస్ నేతలకు రాహుల్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ రెబల్ లీడర్ సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ హై కమాండ్.. ముఖ్యంగా రాహుల్ గాంధీ సాప్ట్ కార్నర్‌తో ఉన్నారు. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆడియో టేపులు బయటకి రావడంతో.. వారిద్దరీ ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. కానీ సచిన్ పైలట్‌పై మాత్రం మెతక వైఖరి అవలంభిస్తున్నారు. ఇందుకు కారణం రాహుల్ గాంధీ అని తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటుకు సంబంధించి మీడియాతో మాట్లాడే ముందు రణదీప్ సుర్జేవాలకు రాహుల్ గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. సచిన్ పైలట్ పేరు ప్రస్తావించొద్దని, నెగిటివ్ వెళ్తుందని చెప్పడంతో మిగతా ఇద్దరు నేతలపై మాత్రం అనర్హత వేటు వేశారు.

చిదంబరంతో సచిన్ మంతనాలు: హైకమాండ్‌తో మాట్లాడాలని చిద్దు సజెస్ట్, వేలాడుతోన్న అనర్హత కత్తి..చిదంబరంతో సచిన్ మంతనాలు: హైకమాండ్‌తో మాట్లాడాలని చిద్దు సజెస్ట్, వేలాడుతోన్న అనర్హత కత్తి..

అంతకుముందే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పదవీ నుంచి పైలట్‌నుతప్పించిన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేశామని, సచిన్‌ను కాదని సుర్జేవాలా స్పష్టంచేశారు. కానీ ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్‌పై మాత్రం వేటు వేశారు. సచిన్.. రాహుల్ సన్నిహితుడు కావడంతో.. అతనిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ హై కమాండ్ కూడా ఆచి తూచి స్పందిస్తోంది.

Rahul Gandhi goes soft on Sachin Pilot, Congress avoids direct attack on him after audio tapes leak..

Recommended Video

Sachin Pilot కు అశోక్ గెహ్లాట్ చురకలు! || Oneindia Telugu

గురువారం రాత్రి మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా పైలట్‌తో మాట్లాడారు. ప్రియాంక గాంధీ విడతలవారీగా మంతనాలు జరుపుతున్నారు. కానీ పైలట్ మాత్రం అటు బీజేపీలోకి వెళ్లనని చెప్పారే గానీ. కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తానని ప్రకటించలేదు. కానీ హస్తం పార్టీ మాత్రం ఆయన రాక కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తోంది.

English summary
Congress has suspended two of its MLAs in Rajasthan after leaked audio tapes revealed a conspiracy to topple the Gehlot government, however, Sachin Pilot continues to be a member of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X