farmers protest congress leader rahul gandhi kerala CM pinarayi vijayan కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు సమస్యలు కేరళ సీఎం పినరయి విజయన్
రైతు సమస్యలను రాహుల్ మరచిపోయారు.. పినరయి విజయన్ విమర్శలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈట కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రైతులు/ వారి సమస్యలు అంటే రాహుల్ గాంధీకి పట్టవని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. అందుకే స్వేచ్చగా స్విమ్మింగ్ చేశారని దుయ్యబట్టారు. అన్నదాతలను రాహుల్ మర్చిపోయారని విజయన్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తుంటే రాహుల్ ఏమాత్రం పట్టింపు లేకుండా మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొడుతున్నారని ఎద్దవా చేశారు.
విజయన్ గురువారం తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కేరళకు పర్యాటకం కోసం వచ్చినట్టు ఉన్నారని విజయన్ ఫైరయ్యారు. మత్స్యకారులతో కలిసి ఆయన ట్రాక్టర్ తోలుతున్నారని గుర్తుచేశారు. సముద్రంలో ఈత కొడుతున్నారని చెప్పారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అనే విషయమే మర్చిపోయారని విరుచుకుపడ్డారు.

రైతుల గురించి ఒక్క మాటైనా రాహుల్ గాంధీ మాట్లాడటం లేదన్నారు. వారిని పూర్తిగా విస్మరించారని ఫైరయ్యారు. కేరళ రైతులకు మద్దతుగా ఉండాల్సింది పోయి ఇలా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రాహుల్పై ఒంటికాలిపై లేచారు.