వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా నాయకుడు రాహులే .. ఆ స్థానాన్ని ఎవరూ భర్తచేయలేరన్న గెహ్లట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ వద్దు మొర్రొ అని రాహుల్ గాంధీ అంటుంటే .. ఆ పార్టీ నేతలు మాత్రం మా నాయకుడు రాహుల్ అంటున్నారు. తాను చీఫ్ పదవీ చేపట్టబోనని రాహుల్ భీష్మించుకొని కూర్చొగా .. కాంగ్రెస్ నేతలు మాత్రం రాహుల్ అధ్వర్యంలోనే పనిచేస్తామని స్పష్టంచేశారు. కొందరు నేతలు ఆందోళనలు, ఆత్మాహత్యాయత్నాలు చేస్తుండగా .. రాహుల్ వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు.

రాహుల్ గాంధీ తమ నాయకుడని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ స్పష్టంచేశారు. ఇప్పటికీ కూడా రాహులే తమ అధినేత అని పేర్కొన్నారు. ఇప్పుడు, ఎప్పుడు తమ అధినేత రాహులేనని తేల్చిచెప్పారు. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపికపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుందనే వాదనను తోసిపుచ్చారు. అంతేకాదు ప్రధాని మోడీకి సరైన నేత రాహుల్ అని ఉదహరించారు.

Rahul Gandhi is and will remain captain of Congress: Ashok Gehlot

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వివిధ అంశాలు ప్రభావింత చేశాయని పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు, మతం ఇతర అంశాలు ప్రభావం చూపాయని తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన పూర్వస్థితిని అధిష్టిస్తోందని చెప్పారు. బీజేపీ 2 సీట్ల నుంచి 300 పైచిలుకు స్థానాలు సాధించినట్టు .. కాంగ్రెస్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు .. తెలంగాణ, గోవాలో జరిగినట్టే జరుగుతుందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం వల్ల ఇదీ జరగడం లేదని .. అధికార బీజేపీ అధికార దాహంతో జరుగుతుందని తెలిపారు.

English summary
Denying any leadership crisis in the Congress, Rajasthan Chief Minister Ashok Gehlot on Monday said that Rahul Gandhi is still the captain of the party and will remain so in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X