వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రా.. రమ్మని.. రారా రమ్మని: సచిన్‌కు తెరిచే కాంగ్రెస్ ద్వారాలు, రాహుల్ అనుచరుడి మంతనాలు, ప్రియాంక

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. రెబల్ లీడర్ సచిన్ పైలట్‌ పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అయితే తాను బీజేపీలో చేరడం లేదు.. ఇప్పటికీ తాను కాంగ్రెస్ వాదిననే ఓ మ్యాగజైన్‌కు సచిన్ పైలట్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎంతలా అంటే.. పైలట్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి ఆహ్వానించేంత.. అంతేకాదు పైలట్‌కు ఆరోపణలు చేస్తోన్న గెహ్లట్ కూడా మిన్నకుండి పోవాలని హై కమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయని తెలుస్తోంది. దీంతో రాజస్తాన్‌లో అస్థిరత్వం టీ కప్పులో తుపానుగా మారే అవకాశం ఉంది. మూడు, నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోన్న తమ కుటుంబ సమస్య అయ్యే అవకాశం ఉంది.

రా.. రమ్మని...?

రా.. రమ్మని...?

బీజేపీలో చేరడం లేదు అని పైలట్ స్పష్టంచేయగా.. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వేగంగా స్పందించింది. కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చేందుకు పైలట్‌కు ఇప్పటికీ దారులు తెరచి ఉన్నాయని స్పష్టంచేసింది. రాహుల్ గాంధీ కీలక అనుచరుడు ఈ విషయం స్పష్టం చేయడంతో సచిన్ పైలట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ. అంతేకాదు పైలట్ కాంగ్రెస్ పార్టీ, అధినేతలపై సాప్ట్ కార్నర్‌తో ఉండగా.. తమ సీఎం అశోక్ గెహ్లట్ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని రాహుల్ అనుచరుడు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. బేరసారాలు, బీజేపీతో సంబంధాలు, అందంగా ఉండి, ఇంగ్లీష్ మాట్లాడతారు అని గెహ్లట్ కామెంట్ చేసిన నేపథ్యంలో ఒకవిధంగా హెచ్చరించింది. పార్టీ అంతర్గత సమస్యను పరిష్కరించుకుందామని, పైలట్ సానుకూలంగా ఉండగా.. రెచ్చగొట్టడం ఎందుకు అని స్పష్టంచేసినట్టు సమాచారం.

 రాహుల్ అనుచరుడి ఫోన్..

రాహుల్ అనుచరుడి ఫోన్..

రాజస్తాన్ అస్థిరత్వం తర్వాత సచిన్ పైలట్‌తో రాహుల్ గాంధీ డైరెక్టుగా మాట్లాడలేదు. కానీ అతని అనుచరుడు మాత్రం వారంలో ఒకసారి మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ కూడా మూడుసార్లు స్వయంగా మాట్లాడారని తెలుస్తోంది. అయితే పైలట్ మాత్రం బీజేపీతో స్నేహం చేయొద్దని రాహుల్ అనుచరుడు స్పష్టంచేశారు. బీజేపీ మాయలో పడొద్దని మరీ మరీ చెప్పారు.

హర్యానా సర్కార్ ఆతిథ్యం ఎలా..?

హర్యానా సర్కార్ ఆతిథ్యం ఎలా..?

బీజేపీలోకి వెళ్లనని చెబుతోన్న పైలట్.. ఆ పార్టీ అధికారంలో ఉన్న హర్యానా ఆతిథ్యం ఎందుకు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. బీజేపీ నేతలు, హర్యానా ప్రభుత్వానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలతో బేరసారాలతో సచిన్ పైలట్ పాత్ర ఉందని నిన్న అశోక్ గెహ్లట్ సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం సంచలనం కలిగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేశారని బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తెలిపారని పేర్కొన్నారు.

Recommended Video

KL Rahul Is Missing Cricket, క్రికెట్ కిట్ చూసి కేఎల్ రాహుల్ భావోద్వేగం || Oneindia Telugu
 గెహ్లట్ ధీమా

గెహ్లట్ ధీమా

రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని అశోక్ గెహ్లట్ ధీమాతో ఉన్నారు. తమకు 106 ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని.. రెబల్స్ కూడా తమతో కలుపుకొని చెబుతున్నారు. ఇప్పట్లో తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ఆయన చెప్పడం చూస్తుంటే.. పైలట్‌ను దారిలోకి తీసుకొస్తారనే స్పష్టమవుతోంది. కానీ పైలట్ తదుపరి ప్రతిస్పందన వరకు ఈ సస్పెన్స్ అలాగే కొనసాగనుంది.

English summary
Rahul Gandhi is "keen on keeping the doors open for Sachin Pilot", sources in the Congress told on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X