వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భావోద్వేగం: తల్లి నుదుటిపై ముద్దు పెట్టిన రాహుల్ గాంధీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi Coronation : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలి ప్రసంగం

న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కాస్తా భావోద్వేగం చోటు చేసుకుంది. తల్లి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.

కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికిన తన తల్లి సోనియా గాంధీ నుదుటిపై ముద్దు పెట్టారు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు సోనియా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాచరు.

 కొడుక్కి బాధ్యతలు అప్పగించిన తర్వాత...

కొడుక్కి బాధ్యతలు అప్పగించిన తర్వాత...

కుమారుడు రాహుల్ గాంధీకి కాంగ్రెసు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సమయంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆమె కాసేపు గద్గద స్వరంతో మాట్లాడారు.

 రాహుల్ నా కుమారుడు...

రాహుల్ నా కుమారుడు...

రాహుల్ నా కుమారుడని అందువల్ల తాను అతడిని ప్రశంసించడం భావ్యం కాదని సోనియా గాంధీ అన్నారు. అయితే తాను ఒక్కటి మాత్రం చెప్పగలనని, ఈ పరీక్షా సమయంలో అధికారంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులను ఎదుర్కునేందుకు రాహుల్ సిద్ధపడ్డారని సోనియా అన్నారు.

పార్టీని సవ్యదిశలో నడిపిస్తారని....

పార్టీని సవ్యదిశలో నడిపిస్తారని....

ఎన్నో సవాళ్లను ధైర్యంగా స్వీకరించిన రాహుల్ పార్టీని కూడా సవ్యదిశలో నడిపిస్తారన్న విశ్వాసం ఉందని సోనియా అన్నారు.. అనంతరం ప్రసంగించిన రాహుల్ ఆమె ఆకాంక్షలకు తగినట్టుగా పనిచేస్తానని సమాధానమిచ్చారు.

 తాను ప్రసంగిస్తున్నప్పుడు ఇలా..

తాను ప్రసంగిస్తున్నప్పుడు ఇలా..

సోనియా వీడ్కోలు ప్రసంగం చేస్తుండగా బాణసంచాలు కాల్చడంతో పెద్ద శబ్దం వచ్చింది. "ఆయన చిన్నప్పటి నుంచి చాలా హింసను చూశాడు. ఆయన ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. కానీ రాజకీయ జీవితంలో వ్యక్తిగత దాడిని ఎదుర్కుంటున్నాడు. అది ఆయనను మరించ బలమైన, భయరహిత నేతగా తయారు చేసింది" అని అన్నారు.

English summary
Rahul Gandhi kisses mother Sonia Gandhi's forehead after formally taking charge as the President of AICC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X