వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నియంతల పేర్లతో రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ -మోదీని టార్గెట్ చేయబోయి నవ్వులపాలు

|
Google Oneindia TeluguNews

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. అగ్రి చట్టాలను తొలి నుంచీ విమర్శిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. చట్టాలను వెనక్కి తీసుకోవడం ఒక్కటే అంతిమ పరిష్కారమని వాదిస్తూ వచ్చారు. అయితే, రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతుల ఉద్యమంపై కేంద్రం అణిచివేతకు దిగుతోన్న క్రమంలో ఆయన మరోసారి విమర్శలకు దిగారు. ప్రధాని మోదీ పేరులోని 'ఎం' అక్షరంతో మొదలయ్యే పేర్లతో నియంతలుగా పేరుపొందినవారి జాబితాతో షాకింగ్ ట్వీట్ చేశారు.

మియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనంమియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనం

 ఢిల్లీ శివారులో ఉద్యమ వేడి..

ఢిల్లీ శివారులో ఉద్యమ వేడి..

మరోవైపు రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింగూతో పాటు, ఖాజీపూర్ సరిహద్దు, తిక్రీ సరిహద్దు వద్ద అసాధారణ భద్రతను విధించడం చర్చకు దారి తీసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా, తమ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీసర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్గెట్‌గా 'ఎం' అనే అక్షరంతో పేరు మొదలయ్యే నియంతల జాబితాను ఆయన ట్వీట్ చేయగా, అది వైరలైంది..

నియంతల పేర్లన్నీ ‘ఎం'తోనే..

నియంతల పేర్లన్నీ ‘ఎం'తోనే..

ప్రపంచ నియంతల పేర‍్లన్నీ 'ఎం' తోనే ప్రారంభం అవుతాయంటూ ట్వీట్‌ చేసి రాహుల్‌ దుమారాన్ని రేపారు. ఆయా నేతల పేర్లన్నీ 'ఎం' అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ బుధవారం ట్వీట్ చేశారు. మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ ఉదహరించారు. రైతు ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతున్న ట్విటర్‌ ఖాతాలను బ్లాక్ చేసిన అంశంతోపాటు, పోలీసులు ఏర్పాటు చేసిన మేకులు, బారికేడ్లపైనా రాహుల్ మండిపడ్డారు. అయితే..

 మన్మోహన్, మోతీలాల్ పేర్లేవంటూ..

మన్మోహన్, మోతీలాల్ పేర్లేవంటూ..

'ఎం' అక్షరంతో మొదలయ్యే నియంతల జాబితాతో రాహుల్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్‌, జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, చైనా మాజీ చైర్మన్ మావో పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ నెటిజన్లు విమర్శించారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావిస్తూ ఇంకొందరు రాహుల్‌కి కౌంటర్‌ వేశారు. అసలు ప్రధాని పేరు నరేంద్ర మోదీ, 'ఎన్‌' తో కదా స్టార్ట్‌ అయ్యేదంటూ మరికొందరు రాహుల్‌పై విరుచుకు పడుతున్నారు.

కేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలుకేసీఆర్‌ను కమాండ్ చేస్తా -వాళ్ల ఏడుపును సీఎం తట్టుకోలేడు: మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

English summary
Congress leader and scion of the Nehru Gandhi family, Rahul Gandhi today posted a Tweet listing the names of dictators with names starting with the letter ‘m’, in an apparent jibe on India’s current prime minister Narendra Modi. Social media users also questioned why Rahul decided to skip Chinese leader Mao Zedong, Motilal Nehru, manmohan singh, Mohandas Karamchand Gandhi, in the same lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X