• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ అనూహ్య ఎత్తుగడ: లోక్‌సభ నేతగా రాహుల్ గాంధీ -మోదీపై 3అస్త్రాలు -రాజ్యసభ నాయకుడిగా గోయల్

|

కరోనా విలయాన్ని నిర్వహించడంలో వైఫల్యం, రాఫెల్ కుంభకోణంపై కోర్టుల్లో విచారణ, అధిక ధరలు, పెట్రో మంటలపై సామాన్యుడి భగభగల నడుమ బీజేపీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతున్న క్రమంలో, తనదైన శైలినే కొనసాగిస్తూ నెమ్మదిగా గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఐఏసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని అస్త్రసన్యాసం చేశారని ప్రత్యర్థులు విమర్శించినా పట్టించుకోని ఆయన మారిన పరిస్థితుల్లో తనతోపాటు పార్టీకీ కొత్త ఊపు ఇచ్చేలా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అటు అధికార పక్షంలోనూ కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి..

ఈటలతో మాకు పోటీ లేదు -వాటితోనే -5ఏళ్లు భరించింది కేసీఆరే: huzurabadపై కేటీఆర్ తొలిసారిగాఈటలతో మాకు పోటీ లేదు -వాటితోనే -5ఏళ్లు భరించింది కేసీఆరే: huzurabadపై కేటీఆర్ తొలిసారిగా

రాజ్యసభ నాయకుడిగా గోయల్

రాజ్యసభ నాయకుడిగా గోయల్

ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. మొన్నటి దాకా రాజ్యసభకు నాయకుడి (లీడర్ ఆఫ్ ది హౌజ్)గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ తవర్ చంద్ గెహ్లాట్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి, కర్ణాటక గవర్నర్ గా పంపారు. దీంతో ఖాళీ అయిన ఆ పదవిని మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ దాదాపుగా నిర్ణయం తీసుకుంది. 2010 నుంచీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతోన్న గోయల్.. అటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంతోపాటు కీలకమైన అంశాల్లో వైసీపీ, అన్నాడీఎంకే, బీజేడీ లాంటి మిత్రులతో అనుకూలంగా ఓట్లేయించడం, మోదీ బద్ధ విరోధి మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీలతో సైతం సఖ్యత కొనసాగించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గెహ్లాట్ నిష్క్రమణతో ఖాళీ అయిన రాజ్యసభ నాయకత్వ పదవికి గోయల్ పేరును అధిరాకికంగా వెల్లడించడమే తరువాయి అని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు..

జగన్ తొలి అస్త్రం రఘురామపైనేనా? -పార్లమెంట్ స్తంభన తప్పదా? -వ్యూహాలపై ఎంపీలకు సీఎం నిర్దేశంజగన్ తొలి అస్త్రం రఘురామపైనేనా? -పార్లమెంట్ స్తంభన తప్పదా? -వ్యూహాలపై ఎంపీలకు సీఎం నిర్దేశం

మోదీ బేజారు.. కాంగ్రెస్‌లో హుషారు

మోదీ బేజారు.. కాంగ్రెస్‌లో హుషారు


నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ కుంభకోణం లాంటి అంశాలపై కాంగ్రెస్ తొలి నుంచీ చేస్తోన్న వాదనకు గతంలో కంటే ఇప్పుడు మరింత బలం చేకూరడం, గడిచిన ఏడాదిన్నరగా దేశాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిని సరైన రీతిలో నిర్వహించడంలో మోదీ సర్కారు వైఫల్యం, నిత్యావసరాల ధరలు, పెట్రో మంటలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబిగడం, ఏడు నెలలుగా రైతులు ఉద్యమిస్తుండటం తదితర పరిణామాలతో మోదీ సర్కారు దాదాపు డిఫెన్స్ లో పడిపోయిన స్థితిలో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం, పార్లమెంటులో కేంద్రంపై ఇంకాస్త గట్టిగా పోరాడటం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత హుషారు నింపొచ్చని, ఈ వర్షాకాల సమావేశాలు అందుకు చక్కటి అవకాశమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్టీకి సంబంధించి మరో సంచలన అంశంగా..

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్

రాజ్యసభలో అధికార బీజేపీ మాదిరిగానే లోక్ సభలో విపక్ష కాంగ్రెస్ కు సైతం నాయకుడు కరువయ్యాడు. ఇన్నాళ్లూ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన అధిర్ రంజన్ చౌదరి పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, బెంగాల్ పీసీసీ చీఫ్ గా ఉండటంతో ఆయను తప్పించి కొత్త నేతను నియమించాలని హైకమాండ్ భావించింది. అందుకోసం మనీశ్ తివారి, శశిథరూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలాంటి పేర్లను సైతం పరిశీలించింది. అనూహ్య రీతిలో ఆ బాధ్యతను తీసుకునేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న రాహుల్ మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత కీలక బాధ్యతలు చేపట్టనుండం కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. రాఫెల్ కుంభకోణం, కరోనా విలయం, నిరుద్యోగం.. ఈ మూడు అంశాలపై రాహుల్ గాంధీ చేస్తోన్న వాదనలకు ఇటీవల పెద్ద ఎత్తున స్పందన వస్తున్న దరిమిలా, మోదీకి పోటీగా రాహుల్ ను ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇదే సరైన తరుణమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రాహుల్ అంగీకరించినట్లుగా మాత్రమే వార్తలు రాగా, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆయన నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

English summary
Two crucial posts in the two Houses of Parliament await announcement by BJP and Congress. Sources said BJP may name Piyush Goyal as the Leader of the House in Rajya Sabha while Congress will hold a meeting in the next 48 hours to find a replacement for Adhir Ranjan Chowdhury, who leads the party in Lok Sabha. Top sources in the Congress have said that Rahul Gandhi might replace Chowdhury
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X