వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం చేస్తాం.. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం.. ఆల్వార్‌ అత్యాచార బాధితురాలికి రాహుల్ భరోసా..

|
Google Oneindia TeluguNews

ఆల్వార్ : రాజస్థాన్ ఆల్వార్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ అంశానికి నాయకులు రాజకీయ రంగుపులుముకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సీఎం అశోక్ గెహ్లాట్‌ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో కలిసి బాధితురాలి ఇంటికెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. రాజకీయ లబ్ది కోసం ఇక్కడకు రాలేదని స్పష్టంచేశారు. బాధితురాలికి న్యాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని అన్నారు. 'ఘటన గురించి తెలిసిన వెంటనే అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడాను. ఇది రాజకీయ అంశం కాదు. బాధిత కుటుంబాన్ని కలిశాను, వారికి తప్పకుండా న్యాయం చేస్తాను. దోషులను కఠినంగా శిక్షిస్తామ'ని రాహుల్ స్పష్టం చేశారు.

Rahul Gandhi meets Alwar gangrape victim’s family

ఏప్రిల్ 26న ఆల్వార్ సమీపంలో ఆరుగురు దుండగులు దళిత మహిళపై భర్త ఎదుటే సామూహిక అత్యాచారం చేశారు. వారిలో ఒకరు అత్యాచార దృశ్యాలను వీడియో తీసి సర్క్యూలేట్ చేశాడు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయగా... పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించారు. దీనిపై దుమారం రేగడంతో ఎట్టకేలకూ మే 2న ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

English summary
Congress president Rahul Gandhi Thursday met the family of the Dalit woman who was allegedly gangraped in Rajasthan’s Alwar district. He was accompanied by Chief Minister Ashok Gehlot and his deputy Sachin Pilot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X