వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడు మగాడ్ర బుజ్జీ..మాటమీద నిలబడ్డాడు...అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వీడు మగాడ్ర బుజ్జీ.. అన్న మాట మీద నిలబడి కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. అధ్యక్షుడిగా కొనసాగబోనని తేల్చిచెప్పి.. పదవీని త్యజించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తన వారసుడిని ఎంపిక చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి (సీడబ్ల్యూసీ)కి రాహుల్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా మోతిలాల్ వోరాకు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ.

ఓటమితో ..

ఓటమితో ..

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో తన పదవీకి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా వద్దని కార్యకర్త నుంచి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వరకు కోరినా .. రాహుల్ వినలేదు. అయితే పెద్దల కోరిక మేరకు 4 నెలలు అధ్యక్ష పదవీ స్వీకరిస్తానని అంగీకరించారు. ఈ క్రమంలో సడెన్‌గా రాహుల్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. తాను అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నానని.. కానీ కాంగ్రెస్ పార్టీ నిజమైన సైనికుడిగా శ్రమిస్తానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దేశం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేస్తానని ఉద్ఘాటించారు.

గౌరవప్రదంగా ...

గౌరవప్రదంగా ...

‘చిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీ చేపట్టే అవకాశం రావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని రాహుల్ కోట్ చేశారు. దేశం కోసం పార్టీ విలువల కోసం కృషిచేశానని .. ఎల్లప్పుడూ పాటుపడతానని పేర్కొన్నారు. తనకు అత్యున్నత పదవీ వరించడం, ప్రేమ, అభిమానం లభించడాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు రాహుల్. అయితే పార్టీ అధ్యక్షుడిగా 2019 ఎన్నికలకు నైతిక బాధ్యత వహిస్తున్నానని మరోసారి ఉద్ఘాటించారు. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాలేదని.. జవాబుదారితనం చివరిదశకు చేరిందని వాపోయారు. అందుకోసమే తాను పార్టీ అధ్యక్ష పదవీ నుంచి తప్పించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. అయితే తదుపరి అధ్యక్షుడి విషయంలో సీడడ్ల్యూసీ చూసుకుంటుందని .. అందులో తన ప్రమేయం ఉండబోదు‘ అని స్పష్టంచేశారు రాహుల్.

వోరాకు బాధ్యతలు ..

వోరాకు బాధ్యతలు ..

కాంగ్రెస్ పార్టీ రాహుల్ రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో .. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు మోతిలాల్ వోరాకు అప్పగించారు ఈ మేరకు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష పదవీకి రాహుల్ రాజీనామా తర్వాత 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధ్యక్షులు కూడా రాజీనామా బాట పట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా రాష్ట్రాల చీఫ్‌లు బాధ్యత వహించాలని రాహుల్ స్పష్టంచేశారు. అంతేకాదు రాజీనామా చేశాక .. ట్విట్టర్‌లో తన బయోడేటాను కూడా మార్చివేశారు రాహుల్. ఇదివరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా హోదా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని మార్చివేశారు.

English summary
Rahul Gandhi on Wednesday officially resigned as Congress President, taking the complete responsibility of the party's poor show in Lok Sabha elections. Rahul Gandhi, in a tweet, shared his resignation letter and vowed to resist Bharatiya Janata Party's idea of India. He said he is "a loyal soldier of Congress" and "a devoted son of India" and will continue to protect the country till his last breath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X