వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరులారా వందనం: కల్నల్, జవాన్లకు రాహుల్ గాంధీ నివాళి, అండగా ఉంటామని భరోసా...

|
Google Oneindia TeluguNews

లడాఖ్‌లో చైనా సైనికులతో భారత జవాన్లకు జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సోమవారం రాత్రి లైన్ ఆఫ్ అక్చువల్ కంట్రోల్ వద్ద గల లడాఖ్ గల్వాన్ వ్యాలీ వద్ద ఇరు దేశాలకు చెందిన జవాన్లకు ఘర్షణ జరిగింది. దీంతో కల్నల్ సంతోష్, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.

మే 5వ తేదీ నుంచి తూర్పు లడాఖ్‌పై చైనా కొర్రీలు పెడుతోన్న సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి తూర్పు లడాఖ్ కల్నాల్ సంతోష్ నేతృత్వంలో బెటాలియన్ పనిచేస్తోంది. అయితే తమ ప్రాంతంలో ఇండియన్ జవాన్లు చొచ్చుకొచ్చారని డ్రాగన్ ఆరోపిస్తోంది. ఇరువర్గాల మధ్య దాడి జరిగినట్టు తెలుస్తోంది. భారత్ నుంచి ఇద్దరు జవాన్లు, కల్నాల్ చనిపోయారు. చైనా జవాన్లు కూడా మృతిచెందారని.. అక్కడి స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

Rahul Gandhi pays tribute to soldiers martyred during India, China face-off..

చైనా దురాక్రమణ చేస్తున్న స్పందించడం లేదని ప్రధాని మోడీపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఘటనపై అండగా నిలిచారు. లడాఖ్ ఘటన తెలిసి నోట మాట రావడం లేదు. దేశం కోసం అధికారి/జవాన్లు ప్రాణ త్యాగం చేసిని వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కఠిన సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు.

గత నెలన్నర నుంచి లడాఖ్ వద్ద భారత్-చైనా బలగాలను మొహరించాయి. భారత ఎల్ఏసీ గల్వాన్ వ్యాలీ, పాన్ గాంగ్ టీఎస్వో లేక్ వద్ద చైనా బలగాలను మొహరించింది. దీంతో భారత ఆర్మీ కూడా బలగాలను మొహరించింది.

English summary
Congress leader Rahul Gandhi has expressed his condolences to the families who lost their loved ones during the violent face-off between Indian and Chinese troops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X