వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఎవరిని?: మోడీ టార్గెట్‌గా రాహుల్ ట్వీట్, స్వామి అగ్నివేష్‌పై అందుకే దాడి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్‌తో విరుచుకుపడ్డారు. స్వామి అగ్నివేష్ పైన దాడి మీద ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

'ద్వేషం, భయంను ఉపయోగించి అధికారం అనుభవిస్తాను, బలహీనులను అణిచివేస్తాను.. నేను ఎవరిని' అని రాహుల్ ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దానికి కింద స్వామి అగ్నివేష్ పైన దాడికి పాల్పడుతున్న వీడియోను పోస్ట్ చేసారు.

Rahul Gandhi posts pop quiz to slam BJP over Swami Agnivesh assault

కాగా, జార్ఖండ్‌లో స్వామి అగ్నివేష్‌పై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భారీగా తరలివచ్చిన యువ మోర్చా కార్యకర్తలు దాడికి చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్‌లో చోటు చేసుకుంది. లిట్టిపాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకూర్‌కు స్వామి అగ్నివేష్ చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో స్వామి అగ్నివేష్ ఉన్నాడనే విషయం తెలుసుకొని బీజేపీ యువ మోర్చా, విశ్వహిందు పరిషత్ భారీగా తరలి వచ్చారు.

హోటల్ నుంచి ఆయన బయటకు రాగానే మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన దుస్తులు చిరిగిపోయాయి. నల్లజెండాలు ప్రదర్శించారు. స్వామి అగ్నివేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, క్రైస్తవ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి జార్ఖండ్‌లోని గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ వారు దాడికి పాల్పడ్డారు.

English summary
In a jibe at the BJP over the assault on social activist Swami Agnivesh, Congress chief Rahul Gandhi today posted a "pop quiz" on Twitter, asking, "I use hatred and fear to maintain the hierarchy of power, who am I."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X