వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ వ‌చ్చాక‌ ఆ చ‌ట్టాలు చెత్త‌బుట్ట‌లోకే - రైతులతో రాహుల్ - ఖేతీ బచావో యాత్ర ప్రారంభం

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ ఇటీవల కేంద్రం సవరించిన వ్యవసాయ చట్టాలను 'నల్ల చట్టాలు'గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కొత్త చట్టాలతో రైతులు సంతోషంగా ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని, సంతోషంగా ఉంటే రైతులు రోడ్లెక్కి నిరసనలు ఎందుకు చేస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాదు..

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ నల్ల చట్టాలను చెత్తబుట్టలో పారేస్తామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన 'ఖేతీ బచావో యాత్ర'ను ఆదివారం పంజాబ్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా జిల్లా బద్నికలాన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.

హాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్‌ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనంహాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్‌ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనం

Rahul Gandhi promises to scrap farm laws if Congress comes to power in Centre

నిజంగా వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే అయిఉంటే, కేంద్రం కచ్చితంగా పార్లమెంటులో చర్చచేసి ఉండేదని, ఇవి తప్పుడు చట్టాలు కాబట్టే చర్చకు అవకాశం ఇవ్వకుండా హడావిడిగా బిల్లుల్ని ఆమోదించుకుందని రాహుల్ అన్నారు. క‌రోనా విస్త‌రిస్తున్న స‌మ‌యంలో వ్య‌వ‌సాయం చ‌ట్టాల‌పై మోదీ ప్ర‌భుత్వం ఎందుకు ఆత్ర‌ప‌డింద‌ని ప్రశ్నించారు. నిజానికి మోదీ సర్కారు తీసుకొచ్చిన చట్టాలు రైతులకు ఉపయోగపడకపోగా, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రైతుల్ని బానిసలుగా చేస్తుందని చెప్పారు.

బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలాబీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలా

Recommended Video

Hathras : Rahul Gandhi, Priyanka Gandhi Reach Hathras ప్రపంచంలో ఏ శక్తి ఆ కుటుంబం గొంతు నొక్కలేదు..!

ఖేతీ బచావో యాత్రలో భాగంగా పంజాబ్ రైతులు ఢిల్లీ వరకు ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ చేయనున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో కలిసి ఆదివారం బద్నికలాన్ లో ప్రారంభించారు. అక్కణ్నుంచి జత్ పురా వరకు తొలిరోజు యాత్ర జరుగనుంది. మూడోరోజుకు యాత్ర ఢిల్లీకి చేరనుంది.

English summary
Former Congress president Rahul Gandhi on Sunday promised to scrap the recently-passed farm laws when his party is elected back to power in Centre. Launching the party’s three-day Kheti Bachao Yatra in punjab's moga on sunday, the Congress leader said, “If farmers are happy with these laws then why are they protesting across the nation? Why is every farmer in Punjab protesting?”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X