వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా, రాహుల్ గాంధీ పోటాపోటీ సమావేశాలు, హీరో ఉపేంద్రను ఆహ్వానించిన కాంగ్రెస్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కర్ణాటక చేరుకున్నారు. రాయచూరులోని వ్యవసాయ విశ్వవిధ్యాలయంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ కర్ణాటక కార్యకర్తల బహిరంగ సభలో యువరాజు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

బెంగళూరులో అమిత్ షాకు ఘనస్వాగతం, 150 ఎమ్మెల్యే సీట్లు లక్షం, ఆట మొదలైయ్యింది!బెంగళూరులో అమిత్ షాకు ఘనస్వాగతం, 150 ఎమ్మెల్యే సీట్లు లక్షం, ఆట మొదలైయ్యింది!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంలో రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ మీద విమర్శలు చేశారు. దేశంలో సమర్థవంతమైన పరిపాలన లేదని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిన అభివృద్దే కర్ణాటకలో 2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తోందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

Rahul Gandhi rally at Raichur in Karnataka

ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే న్యాయం చేసిందని అన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన బుద్ది చెబుతారని జోస్యం చెప్పారు. హైదరాబాద్ కర్ణాటక ప్రజల అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,500 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ. 1,500 కోట్లు కేటాయించామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ లో సూపర్ స్టార్, ఖాకీ చొక్కా?హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ లో సూపర్ స్టార్, ఖాకీ చొక్కా?

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తే నేను స్వాగతిస్తానని అంతకు ముందు కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకే రోజు కర్ణాటకలో అడుగుపెట్టారు.

English summary
Congress Vice President Rahul Gandhi in Karnataka. On August 12, 2017 he adressed party workers rally at Raichur. Here are the speech highlights of Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X