వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాహుల్! ఆ 2 రాష్ట్రాల పేర్లు వందసార్లు రాయండి’: బీజేపీ పనిష్మెంట్ అందుకే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ ఓ పనిష్మెంట్ ఇచ్చింది. ఇందుకు ఆయన ట్విట్టర్‌లో చేసిన పొరపాటే కారణం. ఒక రాష్ట్రానికి బదులు మరో రాష్ట్రం పేరు రాసి బీజేపీకి దొరికిపోయిన రాహుల్‌పై బీజేపీ సెటైర్లు వేసింది.

మిజోరాంకు బదులు మణిపూర్..

మిజోరాంకు బదులు మణిపూర్..

రాహుల్ గాంధీ సోమవారం ట్విట్టర్‌లో ఓ పోస్టులో మిజోరాంకు బదులు మణిపూర్ అని రాశారు. మిజోరాంలో సైనిక్ పాఠశాలలో అర్ధ శతాబ్దం తర్వాత బాలికలకు ప్రవేశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీని గురించి ప్రస్తావిస్తూ మిజోరాంకు బదులుగా మణిపూర్ అని రాశారు.

వ్యంగ్యాస్త్రాలు..

వ్యంగ్యాస్త్రాలు..

అయితే, ఆ వెంటనే ఆ ట్వీట్‌ను రాహుల్ ఖాతాలో నుంచి తొలగించారు. కానీ, ఆలోపే పలువురు ట్వీట్‌ను స్క్రీన్ షాట్స్ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఆ పోస్టులపై వ్యంగ్యాస్త్రాలు జోరందుకున్నాయి. కొద్దిసేపటి తర్వాత మిజోరాంగా మార్చి ట్వీట్ చేయడం గమనార్హం.

బీజేపీ పనిష్మెంట్..

బీజేపీ పనిష్మెంట్..

కాగా, బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ రాహుల్ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్రాల గురించి రాహుల్‌కు తెలియకపోవడం సమస్యాత్మకం అని పేర్కొన్నారు. అంతేగాకుండా రాహుల్‌కు పనిష్మెంట్ కూడా ఇచ్చారు.

వందసార్లు రాయండి..

‘రాహుల్ గాంధీ.. ఇది వందసార్లు రాయి ‘మిజోరాం, మణిపూర్ ఈశాన్య భారతదేశంలోని రెండు వేర్వేరు రాష్ట్రాలు. ఈ విషయాన్ని నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం గుర్తుంచుకుంటాను'' అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

Recommended Video

రాహుల్ ఇండోర్ మెను: పావుబాజీ... చిల్లీ పన్నీర్‌.. కొకొకోలా

English summary
The BJP took potshots at Rahul Gandhi on Monday after the Congress chief mistakenly referred to Mizoram as Manipur on Twitter. The error took place while Rahul was sharing a story on Sainik School in Mizoram opening its doors to girls after over half a century. The only problem was, he got the state's name wrong: Manipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X