వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టర్ 36 (మోడీ) సమర్పించు "కామెడీ వీడియో".. ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి : రాహుల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికపై ఓ వీడియోను వదిలారు. ఇది మిస్టర్ 36 (మోడీ) సమర్పించు కామెడీ వీడియో. దీన్ని మీరంతా చూసి సంతోషిస్తారని భావిస్తున్నా. మీరు చూడటమే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు, ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దీంతో అందరూ ఈ వీడియో చూసి సంతోషిస్తారు అంటూ పోస్ట్ చేశారు. మోడీ మాట్లాడిన పలు వీడియో క్లిప్పులను కలిపి ఈ వీడియో తయారుచేశారు. అందులో ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మోడీ పదేపదే చేసిన ఆరోపణల తాలూకు ప్రసంగాలు ఉన్నాయి. నెహ్రూ మొదలు రాహుల్ గాంధీ దాకా వారి పేర్లను మోడీ మళ్లీ మళ్లీ ప్రస్తావించడం కనిపిస్తుంది.

rahul gandhi released mister 36 modi comedy video on twitter

రాహుల్ గాంధీపై మోడీ ఇటీవల చేసిన ఆరోపణలు ఆయనకు కోపం తెప్పించినట్లుంది. అరిగిపోయిన గ్రామఫోను రికార్డులా రాహుల్ చెప్పిన విషయాల్నే చెబుతూ పదేపదే వల్లిస్తున్నారనేది మోడీ వ్యాఖ్యల సారాంశం. రాహుల్ పిల్లచేష్టలను, ఆయన చెప్పే అసత్యాలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడిన తీరును ప్రజలు సరాదాగా చూస్తున్నారని అన్నారు. పాతకాలంలో గ్రామఫోన్లు కూడా ఇలాగే ఉండేవని.. అవి సరిగా పనిచేయక మళ్లీ మళ్లీ రిపీట్ చేసేవని రాహుల్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

అరిగిపోయిన రికార్డర్ అంటూ మోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆయనే ఓ అరిగిపోయిన రికార్డర్ అంటూ ఎద్దేవా చేశారు. తమ కుటుంబ సభ్యుల నామజపంతో భజన చేస్తున్నారంటూ చురకలు అంటించారు. మొత్తానికి రాహుల్ ట్వీట్ పై కొందరు భిన్నాభిప్రాయాలు వినిపిస్తుంటే.. మరికొందరు సరదాగా తీసుకుంటున్నారు.

English summary
AICC president Rahul Gandhi has left a video on Twitter platform as Prime Minister Narendra Modi Target. It was posted by Mr. 36 (Modi), a comedy video. Recently, Modi has repeatedly commented on the fact that Rahul has said that he has done a rumor. Rahul Gandhi posted this video as a counter to Modi's remarks on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X