వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్ టీకా తీసుకున్న రాహుల్ గాంధీ -ప్రధాని మోదీపై ఫైర్ -ఎల్ఏసీనే కాదు, రాష్ట్రాల సరిహద్దులు సురక్షితంగా లేవు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఎట్టకేలకు కొవిడ్ టీకాను తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా నేతల మాదిరిగా వ్యాక్సిన్ వేయించుకుంటోన్న రాహుల్ ఫొటోలు బయటికి రాకపోవడంతో ఈ వార్త నిజమా, కాదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీకాలపై గతంలో రాజకీయ దుమారం చెలిరేగిన నేపథ్యంలోనూ రాహుల్ వ్యాక్సినేషన్ చర్చనీయాంశమైంది. కాగా,

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

నెల 28న రాహుల్ గాంధీ కొవిడ్ టీకా మొదటి డోసును తీసుకున్నారని, అందుకే గురు, శుక్రవారాల్లో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కాలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ కుటుంబంలో తల్లి సోనియా గాంధీ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోగా, చెల్లి ప్రియాంక గాంధీ ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే,

 Rahul Gandhi reportedly takes COVID-19 vaccine, slams pm modi over assam-mizoram border

ఎల్ఏసీ వెంబడి చైనా కవ్వింపులు, ఈశాన్యంలో అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య తీవ్రమైన సరిహద్దు తగాదా అంశాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ స‌ర్కార్ చేతుల్లో అటు దేశ స‌రిహ‌ద్దులు కానీ ఇటు రాష్ట్ర స‌రిహ‌ద్దులు కానీ భ‌ద్రంగా లేవ‌ని ఆరోపించారు. సమస్యల్ని పరిష్కరించలేని మోదీ చేతగాని తనాన్ని ఆయన ప్రశ్నించారు.

Hyderabad:ఆది, సోమ ట్రాఫిక్ ఆంక్షలు -లాల్ దర్వాజ బోనాలు -వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఇలాHyderabad:ఆది, సోమ ట్రాఫిక్ ఆంక్షలు -లాల్ దర్వాజ బోనాలు -వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఇలా

Recommended Video

Govt Panel Backs Mixing Covishield, Covaxin Doses | Oneindia Telugu

ఈశాన్యంలో అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు వివాదం హింసాత్మకంగా మారడం, జులై 26 నాటి అల్లర్లలో అస్సాంకు చెందిన ఆరుగురు అసోం పోలీసులు, ఓ పౌరుడు మ‌ర‌ణించ‌గా 50 మందికి పైగా గాయాల‌ కావడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మపై మిజోరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో అల్ల‌ర్లు చెల‌రేగిన ప్రాంతంలో ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ బ‌లగాలు మోహ‌రించినా ప‌రిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

English summary
Congress leader Rahul Gandhi has taken the first dose of the vaccine against coronavirus disease (Covid-19) three days ago, according to several reports. Launching a scathing attack on the Narendra Modi-led BJP government over the Assam-Mizoram border dispute and situation at LAC, Rahul Gandhi said that under the current regime neither the national border is secure nor the state borders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X